January 22, 2025
Telugu

రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 న విడుదల

సిరి మూవీస్ బ్యానర్ పై కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం. రమణా కథానాయుకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం లో ప్రియాంక రౌరీ, వర్ష, అంకిత, పావని హీరోయిన్లు గా నటిస్తున్నారు. విలన్ గా సీనియర్ నటుడు వినోద్ కుమార్ నటిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన సాంగ్స్ మరియు టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చాయి. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 స్క్రీన్ మాక్స్ పిక్చర్ సంస్థ విడుదల చేస్తుంది.

Also Read: RRR Movie Review: ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ

ఈ సందర్బంగా హీరో రమణా రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా అంటే ఎంతో గౌరవం ఇష్టంతో సిరి మూవీస్ బ్యానర్ ను స్థాపించి మొదటిగా రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం సినిమా చేసాం. మా బ్రదర్స్ దర్శకులు రమేష్ , గోపి చెప్పిన కథ నచ్చటం అలాగే పక్క కమర్షియల్ స్టోరీ అవడం వలన వెంటనే మూవీ స్టార్ట్ చేసాం. దర్శకులు ఈ సినిమా ని అందరికి నచ్చే విదంగా ఎంతో గొప్పగా రూపొందించారు. ఈ సినిమా ప్రతిఒక్కరికి నచుతుంది అని తొలిసారి నటిస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మా లాంటి యాక్టర్స్ రోల్ మోడల్ అయిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ అందించిన సహకారానికి మరియు మా సినిమా పోస్టర్ ని విడుదల చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మా సినిమా టీజర్ విడుదల చేసి ఎంతగానో మాకు సపోర్ట్ చేసిన వి వి వినాయక్ గారికి ధన్యవాదాలు. మా సినిమా కి మ్యూజిక్ అందించిన మహిత్ నారాయణ్ గారికి , సినిమాటోగ్రఫీ ఏ కె ఆనంద్ గారికి చాల థాంక్స్. మా సినిమాను హైదరాబాద్ , రాయలసీమ, గోవా ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో తీసాం. మా సినిమా నచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 స్క్రీన్ మాక్స్ పిక్చర్ సంస్థ విడుదల చేస్తున్నారు వారికి దన్యవాదాలు. ఈ మూవీ తో నాకు హీరో గా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం వుంది అన్నారు. అలాగే ప్రతిఒక్కరు మా సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాలి అని కోరుకుంటున్న.

దర్శకులు రమేష్ , గోపి మాట్లాడుతూ మూవీ చాల బాగా వచ్చింది అని ఇది పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని అన్నారు. మొదటిగా మేము చెప్పిన కథను నమ్మి ఈ సినిమా ను నిర్మించిన కె.శిరీషా రమణా రెడ్డి గారికి దన్యవాదాలు. హీరో రమణా గారు కొత్త యాక్టర్ అయినప్పటికీ వన్ మాన్ షో గా చాల బాగా నటించారు. అలాగే మహిత్ నారాయణ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి ప్లస్ సంగీతం అద్భుతంగా వుంది ఇప్పటికే సంగీతం మార్కెట్ లో మంచి ఆదరణ పొందాయి. సినిమాటోగ్రఫీ ఏ కె ఆనంద్ సినిమాటోగ్రఫీ చాల బాగుంది. మా మూవీని మీ అందరి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 న విడుదల చేస్తున్నాము ఈ మూవీ అందరిని అలరిస్తుంది అని ప్రతిఒక్కరు ఈ మూవీ థియేటర్ కి వెళ్లి చూడాలి అని కోరుకుంటున్న.

నటీనటులు:
హీరో రమణ, హీరోయిన్లు ప్రియాంక రౌరీ, వర్ష, అంకిత, పావని , రచ్చ రవి , వినోద్ కుమార్ , మిర్చి మాధవి , శంకర్ కృష్ణ , వెంకట్ , jr బాలకృష్ణ , కృష్ణ , సిద్దు

  • బ్యానర్ : సిరి మూవీస్
  • నిర్మాత : కె.శిరీషా రమణా రెడ్డి
  • సమర్పణ : కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి
  • రచన – దర్సకత్వం : ఎం. రమేష్ , గోపి
  • సంగీతం : మహిత్ నారాయణ్
  • రిలీజ్ : స్క్రీన్ మాక్స్ పిక్చర్
  • సినిమాటోగ్రఫీ : ఏ కె ఆనంద్
  • ఎడిటింగ్ : శ్రీనివాస్ పి బాబు , సంజీవరెడ్డి
  • కొరియోగ్రఫీ : చందు రామ్ , రాజ్ పైడి, సాయి శివాజీ
  • ఫైట్స్ : అల్టిమేట్ శివ , కుంగుఫూ చంద్రు
  • ఆర్ట్ : నరేష్ సిహెచ్

Also Read: 65 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు ఉత్తమ చిత్రం- మాయాబజార్