May 17, 2024
Telugu

RRR Movie Review: ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ

స్టార్ హీరోల కథలంటే మామూలుగానే కొంచెం సందడి ఆశిస్తారు మన ప్రేక్షక అభిమానులు కానీ అదే ఇద్దరు స్టార్ హీరోలు మరియు తెలుగులోనే ప్రముఖ డైరెక్టర్ అయిన ఎస్. ఎస్ రాజమౌళి గారెచే రూపొందించబడ్డ చిత్రమంటే ఇక ఆ సందడికి అడ్డు ఆపు ఉండదు. అటువంటి ఉత్సాహం కలిగించే చిత్రమే ఈ ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం). దాదాపు 5 సంవత్సరాల వ్యవధిలో రూపొందించిన చిత్రం ఇది. అంతేకాకుండా కరోనా వంటి సవాళ్లను ఎదుర్కొని ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇందులో రామ్ చరణ్ రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారి నటనలోని నైపుణ్యం మరియు డైరెక్టర్ రాజమౌళి గారి దర్శకత్వపు మంత్రం ఈ చిత్రానికి ప్రాణం పోశాయి అని చెప్పవచు.

Also Read: కలెక్షన్స్ లో దుమ్ము రేపుతున్న RRR అయితే మరి బాహుబలి కలెక్షన్స్ దాటేనా?

ఇక కథలోకి వెల్తే ఇది 1920’s లో ప్రీ-ఇండిపెండెంట్ టైములో జరిగిన ఒక కల్పిత కథ. ఇందులో రామరాజు బ్రిటిష్ ప్రభుత్వం వద్ద పోలీస్ ఆఫీసరుగా పని చేస్తూ ఉంటాడు. అతను తన ప్రమోషన్ కోసం చాలా కష్టపడతాడు కానీ ఇండియన్ అయినందున బ్రిటిష్ ప్రభుత్వం తనకి ప్రమోషన్ ఇవ్వదు. రామరాజు తండ్రికి ఇచ్చిన మాట నెరవేరాలంటే ఈ ప్రమోషన్ అతనికి చాలా అవసరం. అయితే ఒకనాడు రామరాజుకు స్పెషల్ ఆఫీసర్ ప్రమోషన్కు అవకాశం వస్తుంది. దానికోసం అతను గోండు జాతికి చెందిన కొమరం భీమ్ అనే గిరిజన నాయకుడిని పట్టుకొని వీరికి అప్పగించవలసి వస్తుంది. కానీ రామరాజు వెనుదిరిగాడు, భీమ్ కోసం వేటలో పడతాడు.

దీనికి ముందుగా బ్రిటిష్ గవర్నర్ మరియు అతని వైఫ్ ఊరూరూ పర్యటిస్తునపుడు గోండు జాతికి చెందిన మల్లి అనే చిన్నపిల్లని బలవంతంగా తమతో తీసుకొని వెళతారు. అక్కడినుంచి మల్లిని రక్షించడానికి భీమ్ మారువేషంలో ముసల్మాన్ గా తన మనుషులుతో ఢిల్లీకి వస్తాడు. ఇదే ఊళ్ళో ఉంటున్న రామరాజు కి భీమ్ కి అనుకోకుండా స్నేహం కుదురుతుంది. కానీ తర్వాత ఎం జరిగింది? ఇరువురి స్నేహం ఎన్ని సమస్యలకి దారితీసింది? వారు ఇరువురు తమ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఎలా ఛేదిస్తారు? ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం మీరు సినిమా చూడాల్సిందే.

నిప్పు నీరు వంటి శక్తులతో హీరోలని పోల్చి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. రాజమౌళి గారు ఈ నిప్పుకి నీరుకి అల్లిన సంబంధం మనల్ని సినిమాలోని కథకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా సినిమా తీసి తనతో తనకే పోటీ మరెవ్వరు లేరు, ఉండరు, రారు అన్నటుగా మరోసారి నిరూపించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి గారు. అంతేకాకుండా ఈ సినిమాలోని హీరోలు ఇద్దరు తమ నటనలో ది బెస్టని ఈ మూవీలో అందించారు. అందుకే ఈ చిత్రం ప్రజలకి అంతలా చేరువై ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ, వి ఆఫ్ ఎక్స్ ఎఫెక్ట్లు టాప్ నాచ్ క్వాలిటీలో ఉన్నాయి. తీసిన ఒక్కొక సీన్ మన మైండ్లో మూవీ అయ్యాక కూడా తిరుగుతూనే ఉంటాయి. అంతలా ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. కాబట్టి ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలో చూడడం మర్చిపోకండి.

  • దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి
  • కథ: వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్. ఎస్. రాజమౌళి
  • తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్
  • ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
  • సినిమాటోగ్రాఫర్: కె. కె. సెంథిల్ కుమార్
  • డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
  • నిర్మాత: డి.వి.వి దానయ్య
  • విడుదల తేదీ: 25-03-2022