May 2, 2024
Devotional

Nagula Chavithi 2022: నాగుల చవితి పండుగ విశిష్టత మరియు పూజ విధానం

నాగుల చవితి పండుగ విశిష్టత:
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దిని నాగుల చవితి పండుగ లేదా నాగుల పంచమి అంటారు. నాగుల చవితి రోజున నాగేంద్రునికి పూజ చేస్తారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకొని అభ్యంగనాస్నానం చేసి గుమ్మాలకు బంతిపూలతో తోరణాలు కట్టుకొని మావిడాకులతో అలంకరించి గడపలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజచేసుకుంటాము.

ఇంట్లో పూజ విధానం :
పూజ గదిలో నాగేంద్రుని పటంగాని, నాగేంద్రుని ప్రతిమ పెట్టి పూలను అలంకరించుకొని పసుపు, కుంకుమ వేశి దీపారాధన చేసి అగర్బత్తిని వెలిగించి పాలు, చలిమిడి, మొలెకెత్తిన సజ్జలు, అరటిపండ్లు నైవేద్యంగా పెడతారు అలాగే కొబ్బరికాయ కొట్టుకొని కర్పురా హారతి ఇచ్చి మన మనుసులో ఉన్నకోరికలను చెప్పుకోవాలి చెప్పుకున్న తరువాత ఓం నాగేంద్రయానమః మంత్రాన్ని 101 సార్లు జపించటం వలన సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని అందరి నమ్మకం.

Also Read: దీపావళి రోజు ఇంట్లో దీపాలు ఎలా పెట్టాలి? వాటి విశిష్టత ఏమిటి?

పుట్ట దగ్గర చేసే పూజా విధానం:
కొములు ఉన్న పుట్టను చూసుకొని అందరూ పుట్ట చుట్టూ నీళ్లు చల్లి పొడలేకుండా చూసుకొని పసుపు, కుంకుమ చల్లి పూలు అలంకరించి పుట్టచుట్టూ దారంతో 11 పోగులు వేయాలి పుట్టపైన నాగుల వస్రాన్ని ఉంచాలి ఆ తరువాత బియ్యపు పిండితో ముగ్గువేసి తమలపాకు పెట్టి ప్రమిద మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని 2 ఒత్తులు వేసి దీపం వెలిగించిన తరువాత 5 అగర్బతులను తీసుకొని ధూప దీపాలతో నైవేద్యం పెట్టాలి అవి వడపప్పు,బెల్లం, చలిమిడి, మొలకెత్తిన సజ్జలు, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి.

ఇచ్చిన తరువాత నాగేంద్రుని ఇలా మనసులో స్మరించుకోవాలి ” మా వంశంలో ఎవరమైన తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో, నడుం తొక్కితే నావాడనుకో ” అని నమస్కరించుకుని మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని కొములలో ఆవు పాలు 3 కొములలో పోసి అలాగే మనం తీసుకొచ్చిన ప్రసాదం కొంచం కొములున్న దగ్గర అరటిపండును ముక్కలుగా చేసి కొములు ఉన్న దగ్గర చలిమిడి, సజ్జలు పెట్టాలి తరువాత ఇంకో కొములలో కోడిగుడ్డు పెట్టాలి. ఆ తరువాత పుట్టమట్టిని తీసుకొని చెవులకు పెట్టుకుంటే చెవిలో నెప్పి ఉన్న, చర్మవ్యాధులు ఉన్న తగ్గిపోతాయని పెద్దవాళ్ళ నమ్మకం సంతానం లేని వాళ్ళు, నాగ దోషం ఉన్న వాళ్ళు గర్భంలో పుట్టమట్టిని పూసుకుంటే నాగదోషం పోయి పెళ్లిళ్లు కానీ వాళ్లకు పెళ్లిళ్లు అవుతాయి, సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. అలాగే పుట్ట పైన ఉన్న దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటారు కొంతమంది ఆ రోజంతా ఉపవాసాలు ఉండటం వలన నాగదోషాలు తొలగిపోతాయని నమ్మకం.

పుట్ట దగ్గరకు వెళ్లలేని వాళ్ళు గుడిలో ఉన్న నాగ ప్రతిమలకు పూజ చేసి ఉపవాసం ఉండి ఓం నాగేంద్రయా నమః అని మనసులో స్మరించుకోవడం వలన మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయని మనకు అంతా మంచే జరుగుతుంది అని నమ్మకం. అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు.