May 13, 2024
T-Health

Guava Benefits: జామకాయను తొక్క తీయకుండా తినాలి ఎందుకు? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అన్ని రకాల పండ్లను తింటూ ఉంటాము పండ్లలో గొప్పపండు జామపండు ఆ పండు గురించి మనకు తెలియని కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాము.

జామ పండు వలన ప్రయోజనాలు:
కాలం తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో దొరికే జామపండు ఆరోగ్యానికి చాల మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు
జామకాయ నుంచి లభించే ఫైబర్ షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు మంచి ఆహారంగా పనిచేస్తుంది జామకాయ లో విటమిన్ B3, B6 , C విటమిన్స్ ఉంటాయి. అవి మెదడుకి రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును పెంచుతాయి అనారోగ్యాన్ని దరిచేరనియ్యదు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం, కానీ దానిని కడుక్కోకుండా తినడం వలన అనారోగ్యం వస్తుంది అని చెబుతున్నారు డాక్టర్స్ నిమ్మ, నారంజ కాయలలో కన్నా జామకాయలో C Vitamin ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బులను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది.

Also Read: డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

ఫైబర్, కాల్షియం, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే సోడియం, పాస్పరస్ వంటి ఖనిజాలను జామ కాయ కలిగి ఉంటుంది. జామకాయ తినడం వలన చిగుర్లు, దంతాలు గట్టి పడతాయి Vitamin C అధికంగా ఉండటం వలన చిగుర్లు నుంచి వచ్చే రక్తాన్ని నివారిస్తుంది. అందువల్ల పెరిగే పిల్లలు, గర్భిణీ స్త్రీలు జామకాయ తినడం వలన చాల ఉషారుగా ఉంటారు ఉబ్బసం వంటి జబ్బులను కూడా తట్టుకొనే శక్తి ఈ జామకాయకు ఉంటుంది. మనకు జలుబు చేసినప్పుడు జామకాయ తింటే జలుబు తగ్గిపోతుంది.

జామకాయలో ఉండే ఉపయోగాలు :
జామకాయ తినే వాళ్లకు మొటిమలు లేకుండా చర్మం అందంగా కాంతివంతంగా ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్లకు థైరాయిడ్ సమస్యలు తగ్గిస్తుంది, కొవ్వును తీసేసి వ్యాధి, నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో ఉండే మలినాలను తీసివేసి రక్తప్రసరణ సాపీగా జరిగేలా చేస్తుంది, గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇలా అనేక రకాలుగా మేలుచేస్తుంది. జామకాయను తొక్క తీయకుండా తినాలి ఎందుకంటే జామకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్దకం రాదు, గర్భిణీ వాళ్ళకి కూడా జామకాయ చాల మంచిది, మతిమరుపు సమస్యలను తగ్గిస్తుంది, చిగుర్ల నుంచి రక్తం కారే వాళ్ళకి జామ మంచి ఔషధంగా పనిచేస్తుంది.

జామ ఆకులో ఉండే ఉపయోగాలు :

జామకాయే కాదు జామ ఆకు కూడా మనకు ఎంతో మేలుచేస్తుంది, మనము రోజు జామాకు కొంచం జీలకర్ర తీసుకొని బాగా నమిలి తింటే దంతాలు ఆరోగ్యాంగా ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవు మనకు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది జలుబు, దగ్గు, జ్వరం ఉన్న జామఆకు లేదా జామకాయ కూడా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. షుగర్ వాళ్లకు కూడా జామకాయ చాల మంచిది డాక్టర్స్ కూడా షుగర్ వాళ్ళను జామకాయ తినమని చెప్తారు ఇన్ని మంచిగుణాలు ఉన్న జామకాయను ఎవరు తినకుండా ఉండరు అందరూ తినండి ఆరోగ్యంగా ఉండండి.

చిట్కాలు :
1 ) జలుబు ఎక్కువగా ఉన్నపుడు పచ్చి జామకాయ తిని 1 గ్లాస్ నీరు తాగడం వలన జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
2 ) పచ్చి జమ ఆకు ముద్దలా నూరి 3 లేదా 4 సార్లు నుదిటి మీద పెట్టడం కానీ లేదా జమ ఆకు కాషాయం తాగడం వలన తలనొప్పి తగ్గుతుంది.

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించండి మంచిది.