December 18, 2024
Telugu

యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్న కెజిఫ్-2 మూవీ ట్రైలర్ : కెజిఫ్-2 మూవీ ట్రైలర్ రివ్యూ

సినీ ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా కెజిఫ్-2 ట్రైలర్ వచ్చేసింది. ఆడియన్స్ ఊహించిన విదంగా
ట్రైలర్ చాల అద్భుతంగా వుంది. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగండూరి నిర్మించి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన చిత్రం కెజిఫ్-చాప్టర్ 2 ఇంతకముందు వచ్చిన కెజిఫ్-1 కి ఇది సీక్వల్. హీరోగా రాకింగ్ స్టార్ యాష్, సంజయ్ దుత్త , శ్రీనిధి శెట్టి , రవీనా టాండన్ , ప్రకాష్ రాజ్ మరియు తదితరులు నటించారు.

Also Read: RRR 3 days కలెక్షన్స్ : బాహుబలి కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన RRR మూవీ

ఒకసారి ట్రైలర్ లో స్టోరీ చూస్తే కెజిఫ్-1 లో గరుడని క్లైమాక్స్ లో హీరో చంపేస్తాడు. అతను చనిపోయాక కెజిఫ్ ని హీరో ఎలా రూల్ చేస్తాడనేది స్టోరీ. అయితే కెజిఫ్-1 లో హీరోకి మరియు హీరోయిన్ ఫాదర్ కి వున్నా ఒప్పొందం ప్రకారం హీరో గరుడను చంపేస్తాడు. అయితే గరుడను చంపిన తరువాత హీరో నియంతలా మారి కెజిఫ్ ని రూల్ చేస్తాడు.

kgf-2 trailer review in telugu

గరుడ చనిపోయాడు అని తెలుసుకున్న అధీరా , ఒక పోల్టికల్ పర్సన్, హీరోయిన్ ఫాదర్ మరియు అతని అనుచరులు కెజిఫ్ ని ఆక్రమించడానికి ట్రై చేస్తారు. అప్పటివరకు హీరో కెజిఫ్ లో హింస లేకుండా చూస్తాడు కానీ వాళ్ళ ఎంట్రీతో మళ్ళీ
హింస స్టార్ట్ అవుతుంది. అధీరా యాష్ మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా వున్నాయి. ట్రైలర్ లో హీరో యాక్షన్ సీన్స్ డైలాగ్స్ చాల బాగున్నాయి. అయితే హీరో వీళ్ళందిరిని ఎలా ఎదురుకున్నాడు కెజిఫ్ ని ఎలా రూల్ చేసాడు అనేది స్టోరీ.

ఈ సినిమాని 14th ఏప్రిల్ 2022 న ప్రపంచవ్యాప్తంగా 5 భాషలో (తెలుగు,కన్నడ,హిందీ,తమిళ్,మలయాళం) విడుదల చేస్తున్నారు.

యూట్యూబ్ లో 1day ట్రైలర్ వ్యూస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం:

  • తెలుగు : 20M
  • హిందీ : 51M
  • కన్నడ : 18M
  • తమిళ్ : 12M
  • మలయాళం : 8M

అన్ని భాషలో కలిపి మొదటిరోజు 109M+ వచ్చాయి. వీటిలో తెలుగులో #1 ట్రెండ్ గా కొనసాగుతుండగా మిగిలిన భాషలో 3 నుండి 5 ట్రెండ్ లో కొనసాగుతుంది. అయితే ఇండియా లో ట్రైలర్ 24 గంటల్లో అత్యంత వీక్షించబడిన చిత్రంగా యూట్యూబ్ లో రికార్డు సాధించింది.

Also Read: RRR Movie Review: ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ