January 22, 2025
T-Health

పసిపిల్లలకు తరచుగా జలుబు మరియు దగ్గు భారిన పడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసం

చాలా మంది తల్లులు తమ పిల్లలు తరచుగా దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్నారని ఆందోళన చెందుతారు, కానీ  దాని లక్షణాలను ఎలా నివారించాలి తెలియక మరింత ఆందోళన చెందుతారు. కొంతమంది దీనికోసం ఓవర్-ది-కౌంటర్ (OTC) డ్రగ్‌ను ఉపయోగిస్తూ ఉంటారు కానీ అది మంచి పద్దతి కాదు, ఎందుకంటే అవి శిశువులు మరియు పసిబిడ్డలకు హానికరమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి, మీ పిల్లల కోసం దగ్గు మరియు జలుబును అణచివేసేందుకు సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలని ఈరోజు మనం చూద్దాము.

నాసల్ డ్రాప్స్ ప్రయత్నించండి:

మీ పిల్లవాడు ముక్కు ఎపుడు జలుబుతో కారుతూ ఉంటే, వారిని జాలుబంతా ఊదమని చెప్పడం మంచిది కానీ అది కుదరకపోతే శ్లేష్మం వదిలించుకోవడానికి నాసల్ ఆస్పిరేటర్ లేదా చూషణ బల్బును ఉపయోగించండి. మందంగా జలుబు ముక్కులో ఇరుక్కుపోయిన  శిశువులకు సెలైన్ వాటర్ డ్రాప్స్ ఉపయోగించండి. సెలైన్ నాసికా చుక్కలు శ్లేష్మాన్ని పలుచగా చేసి వాయుమార్గాల్ని శుభ్రం చేస్తుంది. ఈ చుక్కలను రోజుకు 2-3 సార్లు మాత్రమే ఉపయోగించండి. తరచుగా వాడటం మానుకోండి, ఎందుకంటే తరచుగా వాడటం వలన అది శిశువు ముక్కుకి హాని చేసే అవకాశం ఉంది.

తేనె ఉపయోగించండి:

మీ శిశువు వయసు 1 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ పద్ధతిని నివారించండి, ఎందుకంటే దీని ఉపయోగం అప్పుడే జన్మించిన శిశువులలో అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కానీ, 1సంవత్సరం మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పడుకునే ముందు ½ టీస్పూన్ తేనె ఇవ్వండి. తేనె శ్లేష్మాన్ని పలుచగా చేసి ముక్కునుంచి సులువుగా కార్ల చేస్తుంది. అంతేకాక  అధ్యయనాల ప్రకారం, డాక్టర్ల సూచించిన సిరప్ కంటే ఇది వంద రేట్లు మంచిగా చెప్పబడింది.

మీ పిల్లలు డిహైడ్రేట్ అవకుండా చూసుకోండి:

మీ బిడ్డను హైడ్రేట్‌డ్గా ఉంచండి, శరీరంలో తగినంత నీరు ఉన్నప్పుడు శ్లేష్మం దానంతట అదే సులువుగా బయటకు వచ్చేస్తుంది, అందుకే మీ పిల్లవాడి వయసు బట్టి అతని శరీరానికి తగినంత నీరు తనకి రోజూ అందేలా చూసుకోండి.

హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి

గాలిలో తేమ వలన అది పీల్చినపుడు శ్లేష్మం సులభంగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి, గదిలో హ్యూమిడిఫైయర్ను కాసేపు ఆన్ చేసి ఉంచండి. ఇంకా వేణీల  స్నానం కూడా సహాయపడుతుంది.

గమనిక: గొంతు మరియు ముక్కు నొప్పితో బాధపడేవారికి గట్టి ఆహారాన్ని మింగడం కష్టం కాబట్టి సులభంగా మింగుడు పడే  ఆహారాన్ని మీ పిల్లలకి జలుబు దగ్గు తగ్గేంతవరకు ఇవ్వండి.