November 15, 2024
Devotional

Diwali 2022 in Telugu : దీపావళి రోజు ఇంట్లో దీపాలు ఎలా పెట్టాలి? వాటి విశిష్టత ఏమిటి?

దీపావళి పండుగ గురించి తెలుసుకుందాము:
మన భారతదేశంలో దీపావళి పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటాము ఎంతో సంతోషంతో పిల్లలు, పెద్దలు అందరూ జరుపుకుంటారు ఈ పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఇంటిలో గాని, గోడలమీద గాని, మీద్దిపైన దీపాలతో అలంకరించి అందరూ ఈ పండుగ రోజునా క్రాకర్స్, టపాసులు, బాణసంచులు పేల్చి అంగరంగ వైభవంగా దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళి పండుగను దీపోత్సవం అని కూడా అంటారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం, చేడు నశించిన రోజు దీపావళి అందుకే దీపావళిని మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దీపావళి పండుగని జరుపుకుంటాము.

దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాము :
ఉదయాన్నే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకొని లక్ష్మిదేవికి పూజ చేయడం వలన లక్ష్మి కటాక్షం పొందుతారని నమ్మకం దీపావళి సాయంత్రం ముగ్గులో దీపాలు వెలిగించి కనుల పండుగగా దీపావళి పండుగను జరుపుకుంటారు చిన్న పిల్లలు భూచక్రాలు, తారజువ్వలు పేల్చిన్నపుడు ఎంతో ఆనందంగా ఉంటారు. పెద్దవాళ్ళు చిచ్చుబుడ్డీలు అనేక రకాల టపాసులు పెద్ద పెద్ద బాంబులతో పాటు ఎన్నో రకాల టపాసులు తెచ్చి ఇంటి ముందు సందడిగా పేలుస్తుంటారు దీపావళి పండుగ అంటే మంచి సాధించిన విజయానికి గుర్తుగా అందరూ దీపావళి పండుగను జరుపుకుంటారు కొన్నిచోట్ల నరకాసూరిని బొమ్మని కాల్చి సంబరాలు జరుపుకుంటారు ఎక్కువ మన భారతదేశంలో జరుపుకొనే పండుగలలో దీపావళి పండుగ ఒక్కటి .

దీపావళి పండుగ ఎలా వచ్చింది:
పురాణం ప్రకారం బ్రహ్మ దేవునితో వరం పొందిన నరకాసురుడు దేవతలను, మహర్షులను ఇబ్బందులు పెడుతుంటాడు నరకాసూరిని ఆగడాలు ఎక్కువైపోతున్న సమయంలో సత్యభామ సమేతుడైన శ్రీ కృష్టుడు నరకాసురుని సంహరిస్తాడు అప్పుడు సర్వ లోకాలు ఆనంద దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటారు ఆ రోజునే మనం దీపావళి అంటాము. ఆనాటి నుండి మనం దీపావళి పండుగను జరుపుకుంటాము దీపావళి గురించి అనేక కథలు అందుబాటులో ఉన్నాయి. మరణాన్ని ధరిచేర్చని అమృతం కోసం దేవదేవతలు పాల సముద్రాన్ని చిలుకు తుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉర్భవించింది అందుకే సకలసంపదలతో, అష్టయిశ్వర్యాలను ప్రసాదించే లక్షిదేవికి దీపావళి పండుగ రోజునా సాయంత్రం లక్ష్మి పూజలు చేసి దీపాలు వెలిగించి లక్షిదేవికి పూజలు చేస్తారు.

ఇంట్లో దీపం ఎలా పెట్టుకోవాలి:
5 దీపాలతో గాని 9 దీపాలు గాని 11 దీపాలు గాని 21 దీపాలు గాని మన ఇంటిలో వెలిగించడం చాల మంచిది అయితే దీపాలను ప్రమిదలో వెలిగించడం మంచిది ఎందుకు అనగా భూదేవి దీపం వేడిని భరించలేదట అందువలన ప్రమిదిలో ప్రమిద పెట్టి గాని తమళపాకు పెట్టి గాని ప్రమిద వెలిగించడం చాల మంచిది. దీపం అంటే త్రిమూర్తుల స్వరూపం దీపంలో మూడు రంగులు, కాంతులు ఉంటాయి ఇందులోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీ మహావిష్టువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రసిద్ధి అయినా కాంతులను తెలియజేస్తుంది. దీపాలను వెలిగించాలంటే ముందుగా రెండు ఒత్తులు తీసుకోవాలి ఆ తరువాత ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనెతో గాని భక్తితో వెలిగించాలి అంతే కాకుండా దీపాలను వెలిగించి ఉండటం వలన ఇల్లు లక్షిదేవి నిలయంగా ఉంటుంది అని అందరి నమ్మకం.

ముఖ్య గమనిక :
దీపావళి రోజు దీపాలు పేల్చేటప్పుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు గాని హార్ట్ పేషెంట్స్ ఉన్నప్పుడు పెద్ద శబ్దాలు వచ్చే టపాసులు పేల్చకండి అలాగే టపాసులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి అందరూ జాగ్రత్తగా ఉండండి.

మా NBM LIVE తరుపున అందరికి దీపావళి శుభాకాంక్షలు.