B12 Vitamin Deficiency: B12 విటమిన్ తగ్గితే ఏంజరుగుతుంది?
మన శరీరం పనిచేయాలంటే విటమిన్స్ చాల అవసరం మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది చాల మందిలో b12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్య గా కనిపిస్తుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ దాక అందరిలోనూ కనిపిస్తుంది. విటమిన్లు ఖనిజ లవణాల వంటి సూక్ష్మపోషకాలు కూడా మన శరీరానికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉండాలి ఆలా అందకపొతే b12 విటమిన్ వంటి లోపాలు వస్తూ ఉంటాయి.
B12 విటమిన్ తగ్గటానికి గల కారణాలు :
మెదడు, నాడివ్యవస్థ చక్కగా పనిచేయడానికి కారణం B12 విటమిన్ అతి ముఖ్యమైనది. B12 విటమిన్ మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్త కణాలు తయారవటానికి ఉపయోగపడుతుంది, అందుకే విటమిన్ B12 లోపం అనేది శరీరంలో మెదడుకి రక్తానికి సంబందించిన సమస్యలకు దారి తీస్తుంది. మాంసాహారంలో లభించే విటమిన్ మన శరీరంలో తగ్గితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, అల్జిమస్ వంటి మతిమరుపు సమస్యలు మొదలవుతాయి, కొండరాల నొప్పులు, డిప్రషన్, ఆందోళన, తిమ్మిర్లు, సరిగ్గా నడవలేక పోవటం, మానశిక చీకాగులు, గుండె జబ్బులు, సంతాన లోపాలు క్యాన్సర్ అనేక రకాల సమస్యలు కొంతమందిలో వస్తూ ఉంటాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
B12 విటమిన్ ముఖ్యంగా ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ? తగ్గినపుడు శరీరంలో జరిగే మార్పులు ఏమిటి?
ఈ విటమిన్ b12 లోపం అలాగే ఉంటె నరాల బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, కండరాల నొప్పులు, కాళ్లలో శక్తి లేక పోవటం ఎక్కువ ఈ లోపం నాన్వెజ్ తినని వాళ్లలో ఎక్కువ గా ఉంటుంది కొంత మందిలో నాన్వెజ్ తింటున్న కొన్ని రకాల పేగుల వ్యాధుల వలన B12 విటమిన్ లోపం ఉంటుంది.
B12 తగ్గితే ఎటువంటి సమస్యలు వస్తాయి?
మన శరీరంలో B12 విటమిన్ లేనప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి నీరసం, నీసత్తువ, బలహీనత, చిన్నపిల్లకు మాటలు త్వరగా రాకపోవటం, బరువు తగ్గటం, కదలికలు సరిగా లేకపోవడం, వణుకు ఎలా అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి మన శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 తగ్గింది అని మనము తెలుసుకోవాలి పిల్లలో బాగా అలసట కనిపించిన, రక్తహీనత కనిపించిన, మతిమరుపు, జ్ఞాపక శక్తి లోపం కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ముఖ్యంగా రక్తానికి మెదడు, నాడీవ్యవస్థ కు సంబంధించి విటమిన్ B12 అనేది ముఖ్య పాత్రపోషితుంది.
B12 విటమిన్ పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి :
పాలు, గుడ్డు, చేపలు, చికెన్, మటన్ ఇలాంటి ఆహారం మనం ఎక్కువ తీసుకోవాలి నాన్వెజ్ లో ఎక్కువ B12 ఉంటుంది కాబట్టి మనం మాంసాహారాన్ని ఎక్కువ తీసుకోవాలి కూరగాయలలో ఎక్కువ B12 ఉండదు అందుకనే కూరగాయల కంటే మాంసాహారం ఎక్కువ తీసుకోవాలి B12 తగ్గడానికి ఆహారంతో పాటు ఇతర కారణాలు ఉన్నాయి మద్యపానం వలన వెజ్ తినే వాళ్లలో B12 తగ్గిపోతుంది అందుకనే ఎక్కువ నాన్వెజ్ తినండి B12 లోపాన్ని తగ్గించుకోండి.
గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. B12 విటమిన్ లోపం ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించండి మంచిది.