December 18, 2024
DevotionalTour

శ్రీశైలం లో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు మరియు వాటి విశిష్టత

అతి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో పేరుగాంచిన పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం ఒక్కటి శ్రీశైల మల్లికార్జున స్వామిని ఎవరయితే దర్శించుకుంటారో వాళ్ళకి కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని అందరి నమ్మకం అందరూ శ్రీశైలం వెళ్ళేటప్పుడు హర హర మహాదేవ శంభో శంకర అంటు మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తి శ్రద్దలతో శ్రీశైలం వెళ్తారు.

శ్రీశైల మల్లికార్జున స్వామి విశిష్టత:

శ్రీశైల మల్లికార్జున స్వామి అక్కడ స్వయంగా వెలిశాడని పురాణాలూ చెబుతున్నాయి కానీ ఎప్పుడు వెలిసాడు అని చెప్పడానికి ఆధారాలులేవు మన దేశంలో 12 జ్యోతిర్ లింగాలు ఉన్నాయి అందులో 2 వది అయినా శ్రీశైల మల్లికార్జున క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో 6 వది అయినా భ్రమరాంబిక శక్తి పీఠం శ్రీశైలంలోనే ఉంది.


శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఎక్కడ ఉంది :
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో కృష్ణ నదికి కుడివైపున నల్లమల అడవులలో కొండల గుట్టల మధ్య మేలికలు తిరుగుతూ ఉండే దార్లు లోయలు దాటుతూ చెట్లు గుట్టలను దాటి శ్రీశైలానికి వస్తారు భక్తులందరూ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటారు. బ్రహ్మ గిరి, విష్ట్నుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాల మధ్య వెలసిన శ్రీశైల మల్లికార్జున స్వామికి పాదాభి వందనం చేస్తారు.

అష్టాదశ పురాణాలలో శ్రీశైల వైభవం గురించి వివరించడం జరిగింది ఆదిశంకర చార్యులు ఈ క్షేత్ర విశిష్టతను తెలుసుకొని ఇక్కడే కొంత కాలం ఉండి స్వామివారిని ఆరాధించి శివానంద లహరిని రాసి స్వామికి అర్పించారు. భ్రమరాంబిక అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. త్రేతాయుగంలో శ్రీరామ చంద్రుడు రావణుడిని వదించి దోషాన్ని తొలగించుకోవడానికి సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి వెయ్యి లింగాలను ప్రతిష్టించి పూజించారని మరియు ద్వాపరి యుగాన పాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రానికి వచ్చి లింగ ప్రతిష్టలు చేసారని ఈ క్షేత్ర చరిత్ర చెబుతుంది. ఇన్ని యుగాలుగా ఉన్న శ్రీశైల క్షేత్రాన్ని దేవతలే కట్టారని పురాణాలూ చెబుతున్నాయి.


కృష్ణ నది తీరాన వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలం ఇక్కడ కృష్ణ నది పాతాళగంగ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది లక్షలాది మంది భక్తులు పాతాళ గంగలో పవిత్ర స్నానమును చేసి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు నల్లమల పర్వత శిఖరాలలో కొలువు తీరిన మల్లికార్జున స్వామి వెలసిన పుణ్య క్షేత్రం మన దేశంలోని పుణ్య క్షేత్రాలలో ఒకటిగా చెప్పుకోబడింది. ఈ పర్వత శిఖరాన్ని శ్రీ పర్వతం, శ్రీధన్, సిరి గిరి పర్వతం అని పిలుస్తారు. శతాబ్దాలుగా శ్రీశైల మల్లన్నను దర్షించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు శ్రీశైల మల్లికార్జున లింగం లింగాలలో ఒక్కటయినా ద్వాదశ జ్యోతి, పక్కనే కొలువున్న భ్రమరాంబిక దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కావడం విశేషం. జ్యోతిర్ లింగం మరియు శక్తి పీఠం ఒకే ఆవరణలో ఉండటం శ్రీశైల క్షేత్ర ప్రత్యేకత. ఇక్కడ మల్లికార్జున లింగానికి భక్తులు ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసే ప్రత్యేకత ఉంది మరో విశేషం భక్తులు నేరుగా గర్భ గుడిలోకి వెళ్లి జ్యోతిర్లింగాన్ని చూసి అభిషేకం, అర్చన జరిపించవచ్చు.

క్రీస్తు శకం 4 వ శతాబ్దకాలం నుంచి శ్రీశైలం ప్రఖ్యాతి చెందింది. ఈ పర్వత శ్రేణిలో మనకు కనిపించే నాశిక్ గుహలను శాతావాహన కాలం నాటి పులోమావికి చెందినవని చరిత్ర కాలం చెబుతుంది. మల్లికార్జున క్షేత్రానికి వెళ్లిన భక్తులు నుదుటున వీభూదితో 3 నామాలు పెట్టుకొని హర హర మహాదేవ శంభో శంకర అంటూ మల్లికార్జున స్వామి దగ్గరకు వెళ్లి వాళ్ళ కోరికలను చెప్పుకుంటారు. ముఖ్యంగా శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు సాక్షి గణపతిని దర్శించుకోవాలి.

Visit Website: www.srisailadevasthanam.org