December 18, 2024
Telugu

65 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు ఉత్తమ చిత్రం- మాయాబజార్

65 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు ఉత్తమ చిత్రం- మాయాబజార్

మాయాబజార్ అనేది మహాభారతంలోని ఇతిహాసపు ఊహాగానమైన చిత్రమని మనందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రాన్ని తీసిన విధానం దానిని చూడడానికి మన రెండు కళ్ళు చాలవు అని మనకు అనిపించేలా చేస్తుంది. అంత గొప్పగా దీనిని డైరెక్ట్ చేసినవారు డైరెక్టర్ కే. వి రెడ్డి గారు. ఆయన ఎంతో తెలివి, నైపుణ్యం, మరియు పరిశీలనా శైలితో ఈ మనోహరమైన చిత్రాన్ని తెలుగు ఇండస్ట్రీలో తర తరాలకు గుర్తుండిపోయే విధంగా రూపొందించారు. వి-ఎఫ్-ఎక్స్ ఎఫెక్ట్స్ లేని కాలంలోనే ఇంతటి గొప్ప సినిమాని తీయడం అనేది సాహసమైన పనే అని చెప్పాలి, కానీ డైరెక్టర్ కే. వి రెడ్డి మరియు అతని బృందం అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించింది. దాదాపు 500 మంది టెక్నిషన్లు ఈ సినిమా కోసం ఒక ఏడాది అంత కష్టపడి చివరకు 1957, మార్చి 27వ తేదీన ఈ చిత్రాన్ని దేశమంతటా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అనగా ఈనాటితో తెలుగు చలనచిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా పేరు తెచ్చుకున్న మాయాబజార్ రిలీజ్ అయ్యి 65 సంవత్సరాలు పూర్తవుతుంది.

Also Read: కలెక్షన్స్ లో దుమ్ము రేపుతున్న RRR అయితే మరి బాహుబలి కలెక్షన్స్ దాటేనా?

అంతేకాకుండా సిఎన్ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా ఈ చిత్రం ఎంపికైంది. చాలా వార్తాపత్రికలు, వ్యాస రచన సంస్థలు మాయాబజార్ గొప్పతనాన్ని తెలుపుతూ అనేక వ్యాసాలు అందించాయి. నలుపు తెలుపు లో ఉన్న ఈ చిత్రాన్ని జనవరి 10, 2010వ సంవత్సరంలో రంగు చిత్రంగా మార్చి జనాలకు ముందుకు మల్లి ప్రవేశపెట్టడం జరిగింది.

65 years of mayabazaar

ముందుగా చెప్పుకున ట్లు ఈ చిత్రానికి కే. వి రెడ్డి గారు దర్శకత్వం వహించగా మార్కస్ బార్ట్లే గారు సినిమాటోగ్రఫీ అందించారు. అసలు పాండవులు ఎక్కువగా కనిపించకపోయినా ఎంతో చాకచక్యంతో వారు ఉన్నట్లు గానే చూపించే ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేయగా, నాగేశ్వరరావు గారు అభిమన్యుడి వేషం వేశారు. ఇరువురు వారి ఉత్తమమైన నాటకాన్ని ఈ చిత్రంలో మనకు అందించారు. కానీ వీరికంటే ఎక్కువగా ప్రేక్షకులను తన నాటకంతో కట్టి పడేసింది మాత్రం సావిత్రి గారనే చెప్పుకోవాలి. ఆమె కాసేపు శశిరేఖగానే మరి కాసేపు ఘటోత్కచ పాత్రలోకి మారి ప్రేక్షకులని తన నటనతో అలరించారు. ఇందులో ఆమె నటనకు గాను ఎన్నో ప్రశంసల్ని అందుకున్నారు. ఈ సినిమాలో ఘటోత్కచుని పాత్ర ఎస్వీ రంగారావు గారు పోషించారు. ఆయన నటనకు మెచ్చిన జనాలు ఈ పాత్రలోని ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ధవళేశ్వరం గ్రామంలో నిర్మించారు.

ఇలా సంగీతం దగ్గర నుండి ఎడిటింగ్ వరకు ఎన్నో ప్రశంసల్ని అందుకున్న మాయాబజార్ చిత్రం ఎన్ని సంవత్సరాలైన ఒక తెలుగు ప్రేక్షకుడు అయిన మనందరి గుండెల్లో నిలిచిపోతుంది.

Also Read: చిన్న సినిమాగా ప్రజలముందుకి వచ్చి సంచలనం సృష్టించిన “ది కాశ్మీరీ ఫైల్స్”