అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి పిలుపుకు 40 సంవత్సరాలు
అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. అన్న ఎన్టీఆర్ గారు పార్టీని 29 March 1982 నా స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే అయన అప్పటివరకు వున్నా నేషనల్ పార్టీ Indian National Congress (INC) పార్టీని ఓడించి ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు (1983). లోకసభలో 8వ తొలి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం అవతరించింది (1984 నుంచి 1989).
Also Read: RRR 3rd day కలెక్షన్స్ : బాహుబలి కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన RRR మూవీ
ఎన్టీఆర్ గారు మరణించిన తరువాత 1995 నుంచి చంద్రబాబునాయుడు గారు పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నారా చంద్రబాబునాయుడు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి అనుకుంటున్నారు. మొదటిగా చంద్రబాబునాయుడు గారు ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించి ఆ తరువాత ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నాయకులతో కలిసి ప్రారంబించునున్నారు. ఈ వేడుకలో భాగంగా నూతన లోగో ను కూడా ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్బంగా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికీ నాలుగు దశబ్దాలు మా పార్టీకి బలం నాయకులూ మరియు కార్యకర్తలే అని అన్నారు. ఈ వేడుకకు అందరు ఆహ్వానితులే అన్నారు. ఈ వేడుకలను పార్టీ శ్రేణులు కూడా ఘనంగా జరపాలని అనుకుంటున్నారు.
TDP Office and Contact details
TDP official website page : www.telugudesam.org