December 18, 2024
Telugu

ఉగాది పండుగ ఎలా వచ్చింది – పండుగ ప్రత్యేకత ఏమిటి

ఉగాది పండుగ ఇది మన తెలుగు వారి మొదటి పండుగ, ఉగాది అనేది యుగాది అనే అక్షరం నుంచి వచ్చింది ఈ పండుగను నామ సంవత్సరాది గా కూడా పిలుస్తారు. తెలుగు వారికి ఈ రోజు నుంచి సంవత్సరం ప్రారంభమవుతుంది అందుకనే ఇది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఉగాది పండుగను ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రలో జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా మార్చ్ నెలలో వస్తుంది కొన్ని సార్లు ఏప్రిల్ నెలలో కూడా వస్తుంది. ఈ రోజు నుంచే వసంత ఋతువు కూడా ప్రారంభమౌతుంది.

ఉగాది పండుగ ఎలా వచ్చింది:
చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలూ చెబుతున్నాయి. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలు దొంగిలించాడు అని అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం రూపంలో వెళ్లి సోమకారుణ్ణి వదించి వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మ దేవుడికి అప్పగించాడంట ఆ రోజునే ఉగాది పండుగను జరుపుకుంటాము అని పురాణాలూ చెబుతున్నాయి.

Also Read: అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి పిలుపుకు 40 సంవత్సరాలు

ఉగాది పండుగ ప్రత్యేకత:
ఉగాది రోజు ప్రత్యేకత ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఉండే పదార్దాలు ఒక్కొక్క భావానికి ప్రత్యేకత. ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ పచ్చడి 6 రుచులతో ఉంటుంది అవి తీపి , చేదు , పులుపు , ఒగరు , కారం, ఉప్పు.

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్దాలు:

  • బెల్లం – ఆనందానికి ప్రత్యేకత
  • కారం – సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
  • వేప పువ్వు – భాద కలింగించే అనుభవాలు
  • పచ్చి మామిడి – కొత్త సవాళ్లు
  • ఉప్పు – జీవితంలో ఉత్సాహం , రుచికి సంకేతం
  • చింతపండు – నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు

ఉగాది శుభాకాంక్షలు – NBMLIVE