January 22, 2025
Telugu

టైప్-1 మధుమేహానికి టైప్-2 మధుమేహానికి గల తేడా ఏమిటి?

ఈనాడు విరివిగా కనిపించే జబ్బుల్లో మధుమేహం కూడా ఒకటి. ఇది మహమ్మారిలా వ్యాపించి ఒక్క మన దేశంలోనే  74మిలియన్ ప్రజలను భాధిస్తునట్లుగా ఇటీవలె ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) సంస్ధచే విడుదల చేసిన రిపోర్టులో తేలింది.  ఈ రోగుల్లో 90 కంటే ఎక్కువ శాతం టైప్-2 డయాబెటిస్ భారినపడినట్లుగా ఆ సంస్ధ నిర్ధారించింది. ఇక్కడ మనం ఆలోచించాల్సి ఉంటుంది. అసలు టైప్-1 కి టైప్-2 డయాబెటిస్కి గల తేడా ఏమిటో తెలుసుకుంటే దానిని అడ్డుకోవడానికి వ్యక్తిగతంగా మనమేమైనా చేయగలమా అనేది తెలుసుకోవొచ్చు.

డయాబెటిస్  :-

అసలు డయాబెటిస్ అనగా మన శరీరంలోని రక్తంలో చెక్కెర శాతం ఎక్కువగా ఉండడం.

ఈ ప్రక్రియ మనం ఆహారం తీసుకునే స్టేజినుంచి మొదలవుతుంది. మన శరీరం తీసుకున్న ఆహారాన్ని చిన్నచిన్న భాగాలుగా విడదీసి దానినుంచి గ్లూకోజ్ ని విడుదల చేస్తుంది. ఈ గ్లూకోజ్ మనల్ని ఎనర్జెటిక్గా  ఉంచడానికి దోహదపడుతుంది. అయితే గ్లూకోజ్ శరీరంలోని రక్తంగుండా ప్రయాణించేలా చేసి, కణాలలో నింపి, అక్కడ ఒక కొవ్వుపదార్ధంగా ఉపయోగించుకోవడానికి, లేదా నిలవ ఉంచుకోవటానికి ఇన్సులిన్ కావాల్సివస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ని క్లోమం అనే జీర్ణగ్రంధి ఉత్పత్తిచేస్తుంది. కానీ, ఏ కారణముచేతనైనా గ్లూకోజ్ రక్తంలోనే అధికంగా ఉండడాన్ని డయాబెటిస్ అంటాము.

Also read: Pushpa: The Rise’: Ahead Never Before Never After

 

టైప్-1 డయాబెటిస్:-

ఈ టైప్-1 డయాబెటిస్ అనేది స్వయంప్రతిరక్షక వ్యాధి. ఇక్కడ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్లోమంలోని ఇన్సులిన్ ని ఉత్పత్తిచేసే కనాలని నాశనం చేస్తుంది. దానివల్ల  క్లోమం సరైన మోతాదులో అవసరమైన ఇన్సులిన్ ని ఉతప్తి చేయలేకపోతోంది. దీనితో, ఎనర్జీ అవసరమైన కణాలకి గ్లూకోజ్ చేరుకోలేపోవడం వల్ల అది రక్తంలోనే ఉండిపోయి హెచ్చుస్థాయికి పెరిగిపోతుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. ఈ రోగం రోగియొక్క జీన్స్ మరియు జీవనశైలివల్ల రావొచ్చని అంచనా.

Also read India’s Harnaaz Sandhu Crowned Miss Universe 2021. A Proud Moment to Feel

 

టైప్-2 డయాబెటిస్:-

ఇది మన శరీరంలోని కణాలు ఇన్సులిన్ కి సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవడం వల్ల వస్తుంది. ఈ సమయంలో కోణాలనుంచి ప్రతిస్పందన కోసం క్లోమం ఎక్కువ ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలకి క్లోమం అంత ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ని ఉతప్తి చేయడంలో విఫలమవుతుంది. దానితో రక్తంలో చెక్కెర హెచ్చుస్థాయిలోకి పెరిగిపోయి టైప్-2 డయాబెటిస్ కి  దారితీస్తుంది. ఇది రోగియొక్క ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

Also read Spider-Man: No Way Home Review

డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:-

  • కొవ్వుపదార్ధాలు తక్కువగా ఉండీ, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవడం.
  • వ్యాయామం చేయడం.
  • సిగెరెట్ మరియు మందు అలవాట్లకు దూరంగా ఉండడం.
  • టైంకి భోజనం చేయడం.
  • అన్నిటికంటే ముఖ్యం, క్రమంగా డాక్టర్ తో ఆరోగ్యం గురించి సంప్రదిస్తూ ఉండడం.

Also read ‘Akhanda’ Twitter Review: Nandamuri Balakrishna Is Back