December 18, 2024
Telugu

Summer healthy Drinks : వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా ఇవి తీసుకుంటే మంచిది

వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా ఇవి తీసుకుంటే మంచిది, ఇవి సమ్మర్ లో అలసిపోకుండా శరీరాన్ని చల్లగా వుండేటట్టు చూస్తాయి, మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ పండ్లను తీసుకోవాలి అలాగే పండ్ల జూస్ ను కూడా తాగాలి ఇలా చేస్తే ఆరోగ్య పరమయిన సమస్యల నుండి బయట పడొచ్చు.

అందరూ కూల్ డ్రింక్స్ తాగడం వలన శరీరం చల్లగా అవుతుంది అనుకుంటారు కానీ అది నిజం కాదు కూల్ డ్రింక్స్ తాగడం వలన శరీరంలో వేడు ఎక్కువ అవుతుంది దీనికి కారణం కూల్ డ్రింక్స్ లో ఉండే కెఫయినే మరియు కొన్ని రకాల ఇంగ్రిడియంట్స్ ఉండటమే. అందుకే ఈ వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా నాచురల్ గా దొరికే పానీయాలు తాగడం మంచింది ఈ క్రింద ఇచ్చిన పానీయాలు తాగటం వలన మన శరీరానికి చాలామంచిది అలాగే వీటిలో దొరికే విటమిన్స్ వలన మన శరీరం ఎప్పుడు ఉత్సహంగా ఉంటుంది. అవి ఏమిటో చూద్దాం

Also Read: ఎవరికీ తెలియని హనుమాన్ జన్మ రహస్యం మరియు హనుమాన్ జయంతి చరిత్ర మీ కోసం

నిమ్మరసం (మరియు) నిమ్మకాయ:

నిమ్మకాయ వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందేంచే లక్షణాలు ఎక్కువ గా ఉన్నాయి నిమ్మరసంలో విటమిన్ (సి) ఉంటుంది అలాగే పొటాషియం,ఇనుము,కాల్షియం, ప్రోటీన్లు,కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ శక్తిని మేరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యానికి గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కొంచెం తేనె కలుపుకొని తాగాలి అలా రోజు ఉదయాన్నే తాగితే బరువు కూడా తగ్గుతారు. చర్మం ఫై ముడతలు, మచ్చలు రావు శరీరం లోని రోగ నిరోధక శక్తి నీ పెంచుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. గుండేలో మంట,కడుపు ఉబ్బరాన్ని, మూత్రాశయ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. శరీరం లో ఏర్పాడే విష పదార్దాలను బయటకు పంపుతుంది. జ్వరము,జలుబు రాకుండా కాపాడుతుంది. వేసవిలో నిమ్మ రసం తీసుకోవటం వలన వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.

lemon juice nbmlive

కొబ్బరి నీళ్లు:

ఈ నీరు ఆరోగ్యానికీ ఎంతో మంచిది గర్భిణీ శ్రీలు ఈ కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిది, ఇందులో ఉండే మినరల్ విటమిన్లు ఎలక్ట్రోలైట్స్ ఎంజైములు సైటోకిన్ లాంటి ఎన్నో పోషకాలు శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు రోగాలను రాకుండా కాపాడుతుంది. విరోచనాలు అవుతున్న వారికీ శక్తిని ఇస్తుంది వేసవిలో కొబ్బరి నీళ్లు తీసుకోవటం వలన శరీరం నుండి బయటకు వచ్చే నీటిశాతం తిరిగి శరీరం లోకి వస్తుంది. సాధారణంగా కొబ్బరి నీళ్లు తీపి రుచిని కలిగి ఉంటాయి. ఇందులో ఉండే చక్కర మరియు ఎలక్ట్రోలైట్స్ సులభంగా పిండిపదార్దాలుగా మారుస్తుంది కొబ్బరి పాలలో ఉండే అధిక కొవ్వు శరీరానికీ ఇబ్బంది కలిగించదు ద్రవ రూపంలో ఉండే కొబ్బరి నీరు శరీరానికీ మేలు చేస్తుంది. అంతే కాకుండా చక్కెర కలిపిన కొన్ని రకాల పానీయాల కంటే కూడా సహజ సిద్ధమైన పానీయం గొప్ప పోషకాలతో శరీరానికీ మేలు చేస్తుంది. వేసవికాలంలో కొబ్బరి నీళ్లు అందరికీ మంచిది. ప్రతి ఒక్కరు తాగండి, ఆరోగ్యానికీ చాల మంచిది.

Also Read: RRR మూవీ తరువాత ఎన్టీఆర్ రాంచరణ్ మూవీస్ పరిస్థితి ఏమిటి? హిట్ లేక ఫ్లాప్?

మజ్జిగ:

వేసవికాలం లో మజ్జిగ తాగడం వలన శరీర తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎక్కవ మజ్జిగ తీసుకోవటం వలన అనేక ఆరోగ్య ఉపయోగాలను పొందవచ్చు మజ్జిగ శరీరం లో అవసరమయ్యే సోడియం, క్యాల్షియంను అందిస్తుంది. మజ్జిగ గుండే సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, బి.పీ తగ్గించడంలో పాటు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది, శరీరానికీ హాని చేసే వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపిస్తుంది, శరీరం లో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది, ఏముకలను బలంగా చేస్తుంది, ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, శరీరంలో మెటానాలిజం రేటును పెంచి బరువు తగ్గిస్తుంది, కడుపులో ఏర్పడే అజీర్తి మరియు ఎసిడిటి సమస్యలు తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నేడు చాల మంది అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్నారు అలాంటి వారు మజ్జిగలో ఒక స్పూన్ తేనే కలిపి పరగడుపున తీసుకుంటూ ఉంటే ఊబకాయ సమస్యలు తగ్గుతాయి అలాగే అన్ని రోజులు మజ్జిగ తాగండి ఆరోగ్యానికీ చాల మంచిది.

వేసవి కాలం లో పైన ఇచ్చిన నిమ్మరసం,కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగటం వలన ఆరోగ్యం గా ఉంటారు. వేసవి కాలం లో ఇవి చాల మంచిది. మనకు ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. మనల్ని ఎలాంటి రోగాలు రానీకుండా కాపాడుతుంది.

Also read: THE BEST WEIGHT LOSS DIET PLAN- INTERMITTENT FASTING!