December 18, 2024
Telugu

శ్రీరామ నవమి పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఎలా జరుపుకోవాలి?

శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామ నవమి అంటారు. ఈ పండుగను ప్రతిసంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్ష నవమి రోజున జరుపుకుంటారు. అయోధ్యకు అధిపతి అయినా దశరథ మహారాజు కౌసల్య దంపతులకు పుట్టిన కుమారుడే శ్రీరాముడు. దశావతారంలో 7 వ అవతారంగా రావణుడిని సంహరించుటకై శ్రీరాముడు జన్మిస్తాడు ఈ 7 వ అవతారంనే రామావతారం అంటారు. 14 సంవత్సరాలు తరువాత అరణ్యవాసం నుంచి అయోధ్యకి చేరుకున్న రాముడికి ఈ నవమి రోజునే పట్టాభిషేకం జరుగుతుంది అలాగే సీతారాముల కళ్యాణం జరుపుకునేది కూడా ఈ రోజే అందుకే ఈ శ్రీరామ నవమి పండుగ చాల విశిష్టతమైనది. శ్రీరాముడు సుఖమైనా , కష్టమైన ఎప్పుడు ధర్మాన్ని మీరలేదు రాముడు గొప్ప గుణవంతుడు , ధైర్యవంతుడు మరియు ధర్మ స్వరూపుడు. ఒకే బాణం ఒకే పత్ని అనే సిద్ధాంతాన్ని కలిగినవాడు.

Also Read: ఉగాది పండుగ ఎలా వచ్చింది – పండుగ ప్రత్యేకత ఏమిటి

ఈ పండుగ హిందువులు పండుగ అయోధ్య మరియు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఈ పండుగను చాల అద్భుతంగా జరుపుకుంటారు. ఈ శ్రీరామ నవమి పండుగ రోజున దంపతులు సీతారాముల కళ్యాణం జరిపించడం వలన అష్టఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ప్రతిఒక్కరు శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

శ్రీరాముడు జన్మ రహస్యం :
త్రేతాయుగంలో రావణుడు లంకాధిపతి మరియు శివ భక్తుడు. రావణుడు గొప్ప వీరుడు కావడంతో ముల్లోకాలను జయంచాలని కోరికతో తప్పులు ఎన్నో చేస్తుంటాడు. రావణుడి వలన మానవులే కాదు దేవతలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటున్న సమయంలో దేవతలు శ్రీమహావిష్ణువుని ఆశ్రయయించి రావణుడి అరాచకాలని ఆపాలని వేడుకుంటారు. అప్పుడు శ్రీమహావిష్ణువు తాను రాముడిగా, శ్రీమహాలక్ష్మి సీతదేవిగా అవతరించి రావణుడిని సంహరించి భూలోకాలను రక్షిస్తానని ధర్మాన్ని నిలబెడతాను అని దేవతలకు శ్రీమహావిష్ణువు చెప్తాడు.

శ్రీరామ నవమి ఎలా జరుపుకుంటారు:
ముందుగా క్రింద ఉన్న శ్రీరామ షోత్రంతో మొదలుపెట్టాలి

” శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే ”

ఈ సూత్రంను మూడు సార్లు పఠించాలి.
శ్రీరాముడి మంత్రాలను పఠించడం వలన అన్ని సమస్యలు తొలిగిపోయి సంపద మరియు ఆరోగ్యం పెంపొందుతుంది.
ఇంట్లో శ్రీరామ నవమి పండుగను జరుపుకోవటం వలన సమస్త అరిష్టములు తొలిగిపోతాయి అని పెద్దల నమ్మకం.
శ్రీరాముడికి ఇష్టమైన వడపప్పు , పానకం , పొంగలి , పులిహార మరియు పండ్లను కూడా నైవేద్యంగా పెడతారు.

అందరికి మా NBMLIVE తరుపున శ్రీరామ నవమి శుభాకాంక్షలు

|| జై శ్రీరామ్ || || జై శ్రీరామ్ || || జై శ్రీరామ్ ||

Also Read: అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి పిలుపుకు 40 సంవత్సరాలు