హైదరాబాదులోని అందమైన సందర్శనా స్థలమైన సంఘీ దేవాలయం గురించి తెలుసుకుందామా…
హైదరాబాదులోని అందమైన సందర్శనా స్థలమైన సంఘీ దేవాలయం గురించి తెలుసుకుందామా…
హైదరాబాదుకు దాదాపు 25-35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సంఘీ ఆలయం 1991వ సంవత్సరంలో సంఘీ గ్రూప్ అఫ్ కంపెనీస్ యజమానులు అయిన శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో నిర్మించబడినది. ప్రస్తుతం ఈ ఆలయం యొక్క నిర్వహణ బాధ్యత అంతా సంఘీ కుటుంబానికి చెందిన అనిత సంఘీ గారు చూసుకుంటున్నారు. ఈ దేవాలయం నిర్మించబడిన కొండను ‘పరమానంద గిరి’ అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి పురాతన వాస్తుశిల్పి శైలి అయినా తమిళ చోళ శిల్ప కళను ప్రస్తుత కర్ణాటకకు చెందిన చాణక్య శిల్ప కళను కలగలిపి కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆలయం చుట్టూతా ఉండే వాతావరణం, కొండలు, చెట్లు, పక్షులు, కోతి వంటి అపాయము కలిగించని జంతువులు, వీటన్నిటినీ చూడడం మనసుకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్నీ కలిగిస్తుంది.
సంఘీ ఆలయాన్ని దర్శించు వేళలు ఉదయం 8:30-10:30 మరియు సాయంత్రం 4:00-8:00. ప్రత్యేక పూజలు కొరకు ఆలయాన్ని సాయంత్రం 6:00-8:00 గంటల సమయంలో దర్శించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, సాయంత్రపు వేళలో ఆలయం యొక్క వీక్షణ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, మీరు ఒక్కసారి దర్శిస్తే అక్కడ నుండి మీకు తిరిగి రావాలనిపించదు. అంత అందంగా, మనోహరమైన భావనను కలిగిస్తుంది ఈ సంఘీ ఆలయం. ఇది ఇంత మనోహరంగా ఉండడం వల్ల అనేక సినిమా షూటింగులు కూడా ఈ గుడిలోనే జరుగుతాయి. పైగా ఈ గుడినుంచి రామోజీ ఫిలిం సిటీ 1కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉండడం మీకు రెండిటిని చూసేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది. ఫిలిం సిటీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే దీనిని ఒకసారి చూడండి. Read Also Ramoji Film City Tour
ఈ గుడికి మరో విశేషం ఏమిటంటే దీనికి ప్రముఖంగా వెంకటేశ్వర ఆలయంగా పేరు ఉన్నపటికీ ఈ ఆలయం అనేక దేవాలయాల యొక్క కలయిక. రాధాకృష్ణుల గోపురం దగ్గర నుండి సీతారాముల మందిరం వరుకు చిన్ని చిన్ని ఆలయాలు ఈ సంఘీ దేవాలయ నిర్మాణంలో భాగంగా కట్టడం జరిగింది. కాబట్టి అనేక దేవుళ్లను దర్శించుకునే అవకాశం ఈ ఆలయం మీకు కలిగిస్తుంది. గుడిలో అడుగు పెట్టగానే ఒక 15 అడుగుల ఎతైన ధ్వజస్తంభం మీకు కనిపిస్తుంది. అక్కడినుంచి ప్రారంభమైన మీ దర్శనం గుడిలోని గోశాల వరుకు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఆలయప్రాంగణాన్నిఅంతా అనుభూతి చెందేందుకు ఒక మందిరం కూడా ఉంది. ఎప్పుడు పిల్లలనుంచి పేదల వరకు ఈ ఆలయాన్ని సందర్శించడానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. కనుక ఈ ప్రశాంతమైన, మనసుకు హాయిని కలిగించే ఆలయాన్ని దర్శించడంలో ఆలస్యం చేయకండి. దర్శించి మీ అనుభూతిని మాతో షేర్ చేసుకోండి.
Read Also Ramoji Film City Tour