January 22, 2025
Telugu

రాంచరణ్ శంకర్ కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది? ఈ మూవీ స్టోరీ ఇదే?

శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో రాంచరణ్ , కీరా అద్వానీ హీరో హీరోయిన్ లగా, జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ తారాగణంగా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని 200cr బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీకి కథ అందించగా SS థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ రాంచరణ్ కి 15th మూవీ కాగా దిల్ రాజు బ్యానర్ లో 50th మూవీగా తెరకెక్కడం విశేషం.

Also Read: 1000 కోట్ల క్లబ్ లో చేరిన 3rd ఇండియా మూవీగా RRR మూవీ?

శంకర్ దర్శకత్వంలో రామచరణ్ నటించడం ఇదే మొదటిసారి, శంకర్ దర్శకత్వంలో మూవీ చేయాలి అని ప్రతి హీరోకి ఒక కల ఉంటుంది కానీ చరణ్ కి ఇంత త్వరగా వస్తుంది అని ఎవరు ఊహించలేదు. శంకర్ మూవీ అంటే స్టోరీ ఒక రేంజ్ లో ఉంటుంది, వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్నా మొదటి పాన్ ఇండియా మూవీ ఇది ఈ మూవీ పై ఫాన్స్ బారి అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీలో రాంచరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

స్టోరీ ఒకసారి చూస్తే పోల్టికల్ డ్రామా గా ఈ మూవీ ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. అయితే రాంచరణ్ ఈ మూవీ లో 2 రోల్స్ చేస్తున్నాడు అని ఒక వార్త హలచల్ చేస్తుంది. ఒకటి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ మరొకటి యంగ్ క్యారెక్టర్ ఈ వార్తలో ఎంత నిజంవుందో తెలియదు గాని, ఈ రెండు రోల్స్ లో రాంచరణ్ కనిపించడం చూస్తే భారతీయుడు, ఒకేఒక్కడు మూవీస్ ని కలిపి తీస్తున్నట్టు వుంది, ఈ మూవీ లో రాంచరణ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కి పొలిటికల్ పర్సన్ కి మధ్య జరిగే స్టోరీ లాగ వుంది. ఈ మద్యే రాజమండ్రిలో రాంచరణ్, కీరా అద్వానీ మీద సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేసారు.

Also Read: తాప్సి మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ : Mission Impossible Review

ఏది ఏమైనా ఈ మూవీని శంకర్ తనదైన శైలిలో డైరెక్ట్ చేయబోతున్నాడు దిల్ రాజు కూడా ఎక్కడ తగ్గకుండా మూవీకి ఖర్చు పెడుతున్నాడు ఈ మధ్య ఫిలింసిటీ లో ఒక సాంగ్ కోసం ఏకంగా 5cr ఖర్చు పెట్టాడు. దిల్ రాజు ఈ మూవీ ని 2023 లో మనముందుకు తీసుకోని రావడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మూవీ పేరుని దిల్ రాజు ప్రకటించబోతున్నారు.