November 15, 2024
T-News

Real Estate News: ప్లాట్స్ లేక అపార్ట్‌మెంట్స్ – ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?

హైదరాబాద్ సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుండి పెద్ద ఎత్తులో పెట్టుబడులు పెట్టె కంపెనీ ఓనర్ల వరకు అందరికి  జీవించేందుకు అన్ని విధాలా ఎంతో సానుకూలమైన ప్రదేశమని మనందరికీ తెల్సిందే. ఇక్కడి వాతావరణం  మరియు పెరుగుతున్న సాంకేతిక పరిణామాల కారణంగా చాలా మంది స్థలాలు కొనుగోలుచేసి ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతారు. కాకపోతే ప్రస్తుతం గృహ రుణాల పెరుగుదల కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నాయి. కానీ ఇటీవల  నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ  జూన్-22 నివేదిక ప్రకారం, క్యూ2 2022లో హైదరాబాద్‌లో 17,074 ప్రాపర్టీలు నమోదయ్యాయి కాబట్టి హైదరాబాద్ మొత్తం ఔట్‌లుక్ సానుకూలంగానే ఉందని , 9.1% YoY పెరుగుదల ఉందని నిర్ధారించబడింది.

దీని గురించి  మాట్లాడుతూ, నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన ‘శిశిర్ బైజల్’, “హైదరాబాద్ మార్కెట్‌లోని తుది వినియోగదారులు స్థిరమైన ఆర్థిక వాతావరణం, పెరుగుతున్న గృహ ఆదాయాలు వంటి అంశాల ద్వారా ప్రోత్సహించబడి గృహ కొనుగోళ్లకు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుత నిర్మాణ వ్యయం కొన్ని రియల్ ఎస్టేట్ వర్గాలపై ప్రభావం చూపినప్పటికీ, ఎగువ విభాగాలపై దాని ప్రభావం పరిమితంగా ఉంది, ఇది మార్కెట్‌ను పటిష్టంగా ఉంచుతుంది.

రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభుత్వ చట్టాలు మరియు మౌలిక సదుపాయాల ప్రభావం:

IT వాణిజ్య అభివృద్ధి ద్వారా నగరం యొక్క అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అనేక కంపెనీలు హైదరాబాద్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇది ఈ నగరపు భవిష్యత్తు అభివృద్ధికి సహాయపడ్తుంది. అదనంగా, ఈ కంపెనీలలో పనిచేస్తున్న IT ఉద్యోగులు హోమ్ రెసిడెన్షియల్ మార్కెట్ కోసం చాలా కస్టమర్లను తెస్తారు. కానీ ప్రస్తుతం యూరప్ మరియు ఇతర దేశాలలో రిసెషన్ రావడం వలన , రియల్ ఎస్టేట్ విక్రయాలకు బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది.

ఇక పోతే ప్రభుత్వం వైపు చూసుకున్నా కూడా GST, REAR మరియు గతంలో అమలు చేయబడిన పెద్ద నోట్ల రద్దు వంటి ప్రభుత్వ చట్టాలు నగరం యొక్క రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రయోజనం చేకూర్చాయి. కానీ ఇటీవలి జీఓ 69, జీఓ 111 చట్టాల కారణంగా హైదరాబాద్‌లో ప్రస్తుతం స్థిరాస్తి విక్రయాలు స్తబ్దతగా ఉన్నాయి.

దీని వలన రియల్ ఎస్టేట్ నిపుణులు ప్రస్తుత మార్కెట్లో అమ్మకాలు కొంతవరకు స్తబ్దముగా అయిన మాట నిజమే అయినప్పటికి తొందరలో పరిస్థితి మారి మరల హైదరాబాద్ రియల్ ఎస్టేటులో ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నటు తెలిపారు. 

ప్లాట్స్ లేక అపార్ట్‌మెంట్స్ రెండింటిలో ఏది బెస్ట్

నిర్ణయం ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.

కానీ , నిపుణులు ఇళ్ల కంటే ప్లాట్లు పెట్టుబడిపై (ROI) అధిక రాబడిని  కలిగి ఉంటాయని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి పెద్ద నగరాల్లో భూమి సరఫరా తక్కువగా ఉండటం.

కానీ ప్రస్తుతం ఈ రిసెషన్, ప్రభుత్వ    ఇంకా వివిధ ఇతర కారణాల వల్ల ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి కనుక ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్లాట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. ఇది ఇలా ఉంటే అపార్ట్‌మెంట్ ధరలలో కరెక్షన్ ఎక్కువగా కనిపిస్తున్నటు తెలుస్తుంది. దీనికి ఆధారంగా నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, రూ.25 లక్షల నుండి రూ.50 లక్షల ధర గల రెసిడెన్షియల్ యూనిట్లు ఆగస్టు 2022లో మొత్తం అమ్మకాలలో 55 శాతంగా ఉన్నాయి, ఇది ఆగస్టులో 37 శాతం వాటా నుండి పెరిగింది.

కానీ అమ్మకాల విషయానికి వస్తే మీకు     భూములు ఉన్నట్లయితే ప్రస్తుత మార్కెట్లో అమ్మడం కంటే వేచిచూడగల్గితే  ఒక 6-7 సంవత్సరాల తర్వాత అమ్మడం శ్రేయస్కరమని కొంతమంది రియల్ ఎస్టేట్ నిపుణుల భావన.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి

కొనుగోలు కోసం హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలలోకి పశ్చిమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి చూడండి. కానీ ఇతర చోట్లలో కొనుగోలు చేయాలి అనుకుంటే గనుక మనకు దక్షిణ, తూర్పు భాగాలలో అభివృద్ధి మెరుగుగా కనిపిస్తుంది. కనుక వాటిలో కొనుగోలు చేసుకోడం మంచిది. తరువాత ఉత్తరం వైపు గురించి ఆలోచించండి. 

ప్రాంతాల ఉదాహరణకు, హైదరాబాద్‌లోని దక్షిణ భాగంలో షాద్ నగర్‌ను చూడవచ్చు, షాద్ నగర్ అనగానే  మనం ORR (ఔటర్ రింగ్ రోడ్) అనే పదాన్ని వింటాం. ఈ ORR కారణంగా, షాద్‌ నగర్ నుండి నగరానికి అనుసంధానం సులభం అయింది. ఇది నగరంలోని IT, హార్డ్‌వేర్, ఇండస్ట్రియల్ మరియు ఫార్మా కంపెనీలతో పాటు చుట్టుపక్కల ఉన్న వివిధ విద్యా సంస్థలకు కూడా కేంద్రంగా ఉంది. మరియు ఇది అనేక రకాల పరిమాణాల గల ప్లాట్లు, ఫ్లాట్లు మరియు అపార్ట్‌మెంట్స్ కలిగి ఉంది. కాబట్టి, ఇక్కడ పెట్టుబడి పెట్టడం తెలివైన ఎంపిక అనే అనవచ్చు.

అదేవిధంగా హైలెవెల్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఏర్పాట్లకు ప్రభుత్వం దృష్టి సారిస్తున్న వరంగల్ హైవే కూడా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి స్థలం అని సూచిక.  మరియు పట్టం చెరువు, మియాపూర్, కొంపల్లి మరియు కొండాపూర్ వంటి అనేక ఇతర ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటి లో పెట్టుబడి లాభదాయకంగానే కనిపిస్తుంది.

కానీ చివరగా మీ బడ్జెట్, మీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయడం మంచిది.