December 18, 2024
Telugu

Papaya Benefits: బొప్పాయి కాయ మరియు ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు – Health Tips

బొప్పాయి కాయ మరియు ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు – Health Tips: బొప్పాయి కాయ మరియు బొప్పాయి ఆకు వల్ల మనకు చాల ఉపయోగాలు ఉన్నాయి మన శరీరానికి ఎంతో మంచిది మనలను చాల అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది కాబట్టి మనము బొప్పాయకాయ గురించి తెలుసుకుందాము.

బొప్పాయి వల్ల ఉపయోగాలు:

బొప్పాయి పండులో ఉన్న విటమిన్స్ మరి ఏ పండులో నైనా లేవు అంటారు వైద్యనిపుణులు బొప్పాయిలో విటమిన్ ఏ, సి లు ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్లు కీ ఈ పండు ఎంతో మేలు చేస్తుంది అలాగే మధుమేహం, డయాబెటిక్ వాళ్ళకి ఎంతో మంచిది బొప్పాయి తినడం వలన కంటి చూపు బాగుంటుంది రేచీకటి రాకుండా కాపాడుతుంది. గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి మన శరీరం మీద పుండు కూడా తొందరగా తగ్గుతుంది బొప్పాయిలో ఉండే పీచు పదార్థం మలబద్దకం లేకుండా చేస్తోంది మలబద్దకం ఎప్పుడయితే పోయేందో మొలలు, అరిశమొలలు, పైల్స్ అవి రావు ఈ మల బద్ధకం లేనివారికి పెద్దపేగు కాన్సర్ మలాశయము కాన్సర్ రాదు అని పరిశోధకులు చెబుతున్నారు బొప్పాయిలో ఉండే పీచు పదార్థం రక్తనాళాలను గడ్డకట్టకుండా కాపాడుతుంది బొప్పాయి తినడం వలన చర్మం మీద ముడతలు రాకుండా కాంతివంతంగా ఉంటుంది మనకు బొప్పాయి ఎంతో మంచిది కడుపుతో ఉన్నవాళ్లు ఈ బొప్పాయి పండుని గాని, ఆకుల రసం గాని తాగకూడదు తినకూడదు మిగతావాళ్ళు చిన్న పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ముసలివాళ్ళు అయినా ఈ పండును తినండి ఆరోగ్యానికి చాల మంచిది.

బొప్పాయి ఆకుల వల్ల ఉపయోగాలు:

మనకు డెంగ్యూ వచ్చినప్పుడు బొప్పాయి ఆకులరసాన్ని తాగితే ప్లేటిలెట్స్ పెరగటానికి పనిచేస్తాయి బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలు ఉన్నాయి. వీటిలోని యాక్టోజెనిన్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది కాలేయాన్ని శుభ్రం చేయటానికి పనిచేస్తుంది అంతే కాకుండా లివర్ మరియు కాలేయ జబ్బుల్ని నివారిస్తుంది మలబద్దకాన్ని తగ్గించి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వలన మధుమేహాన్ని తగ్గిస్తుంది అలాగే కిడ్నిలు దెబ్బతినకుండా కాపాడుతుంది ఈ జ్యూస్ తాగటం వలన చర్మం అందంగా కాంతివంతంగా ఉంటుంది.

గమనిక: కడుపుతో ఉన్న మహిళలు (Pregnant women) , గుండెకు సంబందించిన సమస్యలు ఉన్న వాళ్ళు , అలెర్జీలు ఉన్న వ్యక్తులు , మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తులు, హైపోగ్లైసీమియా ఉన్న వ్యక్తులు బొప్పాయి కాయ, ఆకులూ తినకూడదు. బొప్పాయి ఎక్కువగా కూడా తినకూడదు శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది, తగిన మోతాదులో తీసుకోవాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచిది.