January 22, 2025
Telugu

RRR మూవీ తరువాత ఎన్టీఆర్ రాంచరణ్ మూవీస్ పరిస్థితి ఏమిటి? హిట్ లేక ఫ్లాప్?

పాన్ ఇండియా మూవీగా రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో మన అందరికి తెలిసిందే అయితే రాజమౌళి మీద ఒక వార్త ఇప్పుడు హలచల్ చేస్తుంది అది ఏమిటి అంటే రాజమౌళి సినిమాలో చేసిన హీరోలకి తరువాత వచ్చే మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇది వరకు రాజమౌళి మూవీస్ చూసుకుంటే రాంచరణ్ హీరోగా నటించిన మగధీర మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అయితే ఆ తరువాత వచ్చిన మూవీ ఆరంజ్ ఫ్లాప్ గా నిలిచింది. అలాగే ఎన్టీఆర్ తో చేసిన యమదొంగ మూవీ బ్లాక్ బాస్టర్ కాగా తరువాత వచ్చిన మూవీ కంత్రి ఫ్లాప్ అయింది ఇలా చూసుకుంటే రాంచరణ్ ఎన్టీఆర్ యే కాదు మిగిలిన హీరోస్ పరిస్థితి కూడా ఇదే.

ఈ లిస్ట్ లో చూసుకుంటే ప్రభాస్ కు బాహుబలి-2 తరువాత వచ్చిన సాహు మూవీ అలాగే రాజమౌళి తో చేసిన హీరోలు నాని , సునీల్ , రవితేజ లకు కూడా తరువాత మూవీస్ ఫ్లాప్ గా ఉన్నాయి. అంటే రాజమౌళి మూవీస్ లో చేసిన ఏ హీరోకి అయిన తరువాత మూవీ ఫ్లాప్ గా నిలుస్తుంది. రాజమౌళి సినిమాలో హీరోలకి మంచి గుర్తింపు వస్తుంది కానీ వాళ్ళకి తరువాత వచ్చే మూవీ ఫ్లాప్ గా ఉంటుంది.

Also Read: తాప్సి మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ : Mission Impossible Review

RRR తరువాత రాంచరణ్ హీరోగా మొదటిసారి శంకర్ దర్శకత్వం లో నటిస్తున్నారు ఈ మూవీని దిల్ రాజు పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు దాదాపు 60% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 2023 లో మనముందుకు తీసుకొనివస్తున్నారు. ఫ్లాప్ లే చూడని డైరెక్టర్ శంకర్ గారు ఈ సారి రాంచరణ్ తో హిట్ కొడతాడా లేదో చూడాలి.

అలాగే ఎన్టీఆర్ RRR మూవీ తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ మరియు సుధాకర్ గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీని 2023 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ జనతా గ్యారేజ్ ఎన్ని రికార్డు సృష్టించిందో తెలిసిందే. కొరటాల శివ కి కూడా తెలుగులో ఇప్పటి వరకు ఫ్లాప్ లు లేవు. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో హిట్ కొడతాడా లేదో చూడాలి.

ఈ సారి ఎన్టీఆర్ రాంచరణ్ రాజమౌళి మీద వున్నా ఈ దుష్ప్రచారాన్ని వీళ్ళు చెరిపేస్తారో లేదో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: ఉగాది పండుగ ఎలా వచ్చింది – పండుగ ప్రత్యేకత ఏమిటి