January 22, 2025
T-Entertainment

Nani Dasara movie review in telugu – నాని దసరా మూవీ రివ్యూ

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దసరా , ఈ మూవీని March 30th నా థియేటర్లో రిలీజ్ చేసారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

కథనం:
సింగరేణి ప్రాంతంలోని వేర్లపల్లి గ్రామం చుట్టూ సాగే కథ ఇది. నాని (ధరణి) మరియు దీక్షిత్ శెట్టి (సూరి) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు సూరి కోసం ధరణి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు ఎంతలా అంటే తను ప్రేమించిన కీర్తి సురేష్ (వెన్నల) ని కూడా సూరి కోసం వదులుకుంటాడు. ధరణి సూరి రైల్లో బొగ్గు దొంగతనం చేయడం తాగడం ఇవే వీళ్ళు చేసే రోజు పని. ఆ తరువాత కొన్ని రాజకీయాల ప్రభావం వలన సర్పంచి ఎన్నికల్లో శివన్న కొడుకు చిన్న నంబి నిలబడతాడు అతనికి పోటీగా నిలబడిన రాజన్న (సాయికుమార్) కి ధరణి సూరి గ్యాంగ్ మద్దతుగా నిలుస్తారు. ఆ ఎన్నికల్లో రాజన్నని గెలిపించుకుంటారు. ఎన్నికల్లో గెలిచాక ఆ తరువాత ఎం జరిగింది ధరణి సూరి వెన్నల జీవితాలు ఎలా సాగాయి అనేది మిగతా కథనం.

కథనం ఎలా ఉంది ?
దసరా మూవీ ఒక సింగరేణి బొగ్గు గనులలో వీర్లపల్లి గ్రామంలోని కొన్ని జీవితాల మధ్య జరిగే కథ. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాస్ ఎలివేషన్ చాల బాగున్నాయి అని చెప్పవచ్చు , దసరా మూవీలో నాని స్టైల్ పుష్పా మూవీ లో అల్లు అర్జున స్టైల్ ల ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఆ మూవీ లో లాగా హెయిర్ స్టైల్ , డ్రెస్ స్టైల్ ఈ మూవీ లో నాని స్టైల్ అలా ఉంది. స్టోరీ అయితే కొత్తగా ఎం లేదు అని చెప్పాలి , స్నేహం , ప్రేమ , త్యాగాల నేపథ్యంలో ఉంటుంది ఇంచుమించు రంగస్థలం మూవీ లా అనిపిస్తుంది. మొదటి భాగం లో నాని పరిచయం చాల వేగంగా సాగుతుంది బొగ్గు దొంగతనం సీన్ చాలాబాగుటుంది, అలాగే నంబి సర్పంచి ఎన్నికల్లో గెలవటానికి యువతరం మధ్య క్రికెట్ మ్యాచ్ మరియు బార్ క్యాషియర్ పోస్ట్ సూరి వెన్నల పెళ్లి తరువాత నంబి వెన్నలని ఇష్టపడటం దానికోసం సూరి ని హత్య చేయటం ఆ తరువాత నంబి భార్య పూర్ణ నానికి అసలు విషయం చెప్పటం తో మొదటి భాగం అయిపోతుంది దీని తరువుత రొండో భాగం చాల ఆశక్తిని రేకిస్తుంది. అయితే డైరెక్టర్ మొదటిగా రాజకీయంగా చూపించిన తరువాత రెండో భాగంలో రాజకీయం కనిపించదు. రెండో భాగంలో ధరణి వెన్నలని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు ఆ తరువాత నంబిని చంపడానికి ధరణి అతని స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తాడు దసరా రోజున నంబిని చంపడంతో కథ ముగిస్తుంది. డైరెక్టర్ ఈ మూవీ మాస్ ఎలివేషన్స్ ని మంచిగా తీసాడు, నాని ని ఇంకో కోణంలో ఆవిష్కరించాడు అని చెప్పాలి.

ఎలా చేసారు ?
నాని ధరణి పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పాలి. నాని నటన ఈ మూవీ ని మరోస్థాయిలో నిలబెట్టింది అలాగే కీర్తి సురేష్ , దీక్షిత్ శెట్టి నటించిన వెన్నల సూరి పాత్రలు న్యాయం చేసారు, చిన్న నంబి గా మలయాళం నటుడు షైన్ టామ్ చాకో అద్భుతంగా నటించాడు శివన్న గా సముద్రఖని నటించిన అయన పాత్ర అంతగా లేదు అని చెప్పాలి అలాగే రాజన్న గా సాయికుమార్ పాత్ర ఆయనకి తగ్గస్థాయిలో నటించారు.
సాంకేతికంగా మూవీ చాల బాగుంది , కెమరామెన్ సత్యన్ సూర్యన్ , సంతోష్ నారాయణ్ సంగీతం మూవీ కి హైలైట్ గా నిలిచాయి . ” ధూమ్ ధామ్ ” , ” చమ్కీల అంగివేసి ” పాటల చిత్రీకరణం బాగుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి ఇది మొదటి చిత్రం అయినప్పటికి అనుభవం ఉన్న డైరెక్టర్ గా ఈ మూవీ తీర్చిదిద్దాడు.

NBM Live Rating : 3 .5/5