December 18, 2024
Telugu

తాప్సి మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ : Mission Impossible Review

మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ మరియు పి ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి & అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ ఈ మూవీ 01 ఏప్రిల్ 2022 విడుదల చేసారు. ఈ మూవీకి డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జె డైరెక్టర్ ఇదివరకు తీసిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ కి ఇది రెండొవ చిత్రం. తాప్సి మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ మంచి థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. RRR లాంటి పెద్ద సినిమా మధ్య ఈ మూవీని రిలీజ్ చేయడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి.

కథ :
ఈ మూవీ కథ ఒకసారి చూస్తే మూవీ మొత్తం తిరుపతి లోని ఒక చిన్న విలేజ్ లో జరుగుతుంది. ఆ ఊరిలో ఉన్న రగుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు కుర్రాళ్ళు అల్లరిగా తిరుగుతుంటారు వాళ్ళు లైఫ్ లో త్వరగా డబ్బు సంపాదించాలి అని పెద్ద స్థాయికి వెళ్లాలని అనుకుంటారు. అప్పుడే వాళ్ళు మోస్ట్ గ్యాంగ్ స్టార్ అయిన దావుద్ ఇబ్రహీం ని పట్టుకుంటే బారి రివార్డ్ వస్తుంది అని వింటారు ఏది ఆలోచించకుండా పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచే కథ స్టార్ట్ అవుతుంది అయితే వాళ్ళు అక్కడినుంచి వారి పరిస్థితి ఏమిటి? వారు ఆ సవాళ్ళను ఎలా ఎదురుకున్నారు? అలాగే పిల్లలు చివరికి ఏమవుతారు అనేది థియేటర్స్ లో చూడాలి. మరో పక్క ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా తాప్సి పాత్ర ఎలా ఉంటుంది అనేది తెర మీద చూడాలి.

Also Read: మొదటివారం కలెక్షన్స్ లో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేసిన RRR మూవీ

కథకి ప్లస్: ఈ మూవీలో నటించిన ముగ్గురు పిల్లలు చాల బాగా నటించారు అలాగే వారి మధ్య నడిచే కామెడీ చాల ఫన్నీ గా ఉంటుంది . అలాగే వారి ఎమోషన్స్ కూడా చాల బాగుంటాయి. ఈ మూవీ లో మెయిన్ లీడ్ లో నటించిన తాప్సి తన నటనను చాల బాగా కనబరిచింది మూవీ లో అంత ఇంపార్టెన్స్ లేకపోయినా తన రోల్ కి మాత్రం న్యాయం చేసింది. అలాగే ఈ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఆడియెన్సుని కూడా బాగా ఆకంటుకుంటాయి.

కథకి మైనస్: అయితే సినిమా థ్రిల్లింగ్ గా ఉన్న డైరెక్టర్ ఈ మూవీలో కొన్ని లాజిక్స్ మిస్ చేసాడు ఇది వరకు చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లో తీసుకున్న జాగ్రత్తలు ఈ మూవీలో తీసుకోలేదు అని చెప్పాలి చాల వరకు ఈ మూవీలో లాజిక్స్ మిస్ అయ్యాడు. అలాగే పిల్లలు దావుద్ ని పట్టుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్తారు అక్కడ జరిగే కొన్ని సీన్స్ సిల్లీ గా మరియు సంబంధం లేకుండా ఉంటాయి.

నిర్మాతలు ఈ మూవీ బాగానే ఖర్చుపెట్టారు అలాగే టీం కూడా చాల కష్టపడింది అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.అలాగే సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ , డైలాగ్స్ చాల బాగున్నాయి.

చివరగా మూవీ విషయానికి వస్తే అక్కడక్కడా కామెడీ బాగుంది అలాగే థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి కాకపోతే దర్శకుడు ఈ చిత్రంలో లాజికల్ పార్ట్స్ మిస్ అయ్యాడు డైరెక్టర్ తీసిన ఇదివరకు మూవీ తో పోలిస్తే ఈ మూవీ కొద్దిగా నిరాశ పరుస్తుంది అనే చెప్పాలి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ వారంలో ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.

  • విడుదుల తేదీ : 01 ఏప్రిల్ 2022
  • బ్యానర్ : మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ , పి ఏ ఎంటర్టైన్మెంట్స్
  • ప్రొడ్యూసర్స్ : నిరంజన్ రెడ్డి & అన్వేష్ రెడ్డి
  • కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్: స్వరూప్ ఆర్ ఎస్ జె
  • కో -ప్రొడ్యూసర్ – నమ్ పశ
  • మ్యూజిక్ డైరెక్టర్ : మార్క్ కే రాబిన్
  • ఫోటోగ్రఫీ : దీపక్ ఎరగరా
  • ఎడిటర్ : రవితేజ గిరజాల

NBM LIVE రేటింగ్ : 2.5 /5

Also Read: యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్న కెజిఫ్-2 మూవీ ట్రైలర్ : కెజిఫ్-2 మూవీ ట్రైలర్ రివ్యూ