January 22, 2025
Telugu

KGF-2 Movie Review: కెజిఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ | యాష్ హిట్ కొట్టాడా?

బాహుబలి 2 కోసం మూవీ లవర్స్ ఎంతగా ఎదురుచూసారో కెజిఫ్-2 కోసం కూడా అంతే ఎదురుచూసారు, ఎన్నో భారీ అంచనాల మధ్య మూవీని 14 -ఏప్రిల్-2022 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసారు. హోంబేలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగండూరి నిర్మించిన చిత్రం కెజిఫ్ చాప్టర్-2 రచన దర్శకత్వం ప్రశాంత్ నీల్ . ఈ మూవీని 14 -ఏప్రిల్-2022 న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో (కన్నడ , తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం) రిలీజ్ చేసారు. సుమారు 100cr బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా 5 భాషలో నిర్మించారు. ఈ మూవీలో రాకింగ్ స్టార్ యాష్, సంజయ్ దుత్త , శ్రీనిధి శెట్టి , రవీనా టాండన్ , ప్రకాష్ రాజ్ , మాళవిక ప్రధాన తారాగణంగా నటించారు. ఈ మూవీ కెజిఫ్ కి కొనసాగింపు మూవీ నిడివి ఎక్కువ అవడం వలన డైరెక్టర్ 2 పార్ట్శ్ గా తీయడం జరిగింది కెజిఫ్ చాప్టర్-1 ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసందే. యాష్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. స్టోరీ మొత్తం గోల్డ్ మైనింగ్ చుట్టూ తిరుగుతుంది. మొదటి పార్ట్ లో హీరో రాకీ (యాష్) గరుడని చంపడంతో కెజిఫ్ ఛాపర్-1 ముగుస్తుంది నెక్స్ట్ అక్కడి నుంచి కెజిఫ్ చాప్టర్-2 స్టార్ట్ అవుతుంది.

Also Read: 1000 కోట్ల క్లబ్ లో చేరిన 3rd ఇండియా మూవీగా RRR మూవీ?

కథ:
హీరో రాకీ గరుడని చంపినా తరువాత కెజిఫ్ లో వున్నా అధీరా, హీరోయిన్ ఫాదర్ మరియు మిగిలిన వాళ్ళు కెజిఫ్ ని ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తుంటారు. హీరో గరుడని చంపినా తరువాత అక్కడ వున్నా ప్రజలకు రాకీ దేవుడు అవుతాడు, కెజిఫ్ ని(నరాచీ) మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు అది నచ్చని మిగిలిన గ్రూప్స్ రాకీని చంపడానికి ట్రై చేస్తుంటారు. కెజిఫ్ లో ఉన్న ప్రజలు రాకీ కోసం మైనింగ్ తొవ్వడం స్టార్ట్ చేస్తారు కెజిఫ్ లో ఉన్న గోల్డ్ ని తవ్వడం విదేశాలకు సప్లై చేయడం చేస్తుంటాడు హీరో, అదే సమయంలో కెజిఫ్ లో జరుగుతున్నా ఆన్యాలను CBI ద్వారా ఢిల్లీ ఉన్న రామిక సేన్ కి తెలుస్తుంది అలాగే అధీరా కూడా కెజిఫ్ ని ఆక్రమించడానికి చూస్తుంటాడు. ఒకసైడ్ రామిక సేన్ మరో సైడ్ అధీరా ని హీరో ఎలా ఎదురుకున్నాడు కెజిఫ్ ని తన ఆధీనంలోకి తెచుకున్నాడా లేదా అనేదే మిగిలిన స్టోరీ. అలాగే మధ్య మధ్యలో హీరో ఫ్లాష్ బ్యాక్ అతని పుట్టుక గురించి చూపిస్తారు.

కథకి ప్లస్ పాయింట్స్ :
హీరో యాష్ నటన ఎలివేషన్స్ చాల బాగా కనబరిచాడు, సంజయ్ దత్తు అధీరా గా నటన మూవీకి హైలైట్ అని చెప్పాలి ముఖ్యంగా డైరెక్టర్ టేకింగ్ అయితే సూపర్, హీరో రాకీకి రామిక సేన్ కి వచ్చే సన్నివేశాలు చాల బాగుంటాయి, రాకీకి అధీరా కి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు కూడా మూవీ కి హైలైట్ అని చెప్పాలి హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అలాగే మిగిలిన తారాగణం ప్రకాష్ రాజ్ , హీరోయిన్ శ్రీనిధి శెట్టి , మాళవిక, అవినాష్ , అచ్యుత్ కుమార్ , అయ్యప్ప పి, శర్మ , రావు రమేష్ , ఈశ్వరి రావు తదితరుల పాత్రలు తక్కువే అయినా అత్బుతమైన నటన కనబరిచారు . ఫొటోగ్రఫీ మూవీ కి హైలైట్.

Also Read: యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్న కెజిఫ్-2 మూవీ ట్రైలర్

కథకి మైనస్ పాయింట్స్ :
కథనం గజి బిజీ గా ఉండటం కథలో మలుపులు లేకపోవడం మూవీ కి మైనస్, డైరెక్టర్ చాల దగ్గర కథ మిస్ అయ్యాడు అనే చెప్పాలి అధీరా ఎలా వచ్చాడు అనేది మాటలతోనే సరిపెట్టాడు.

చివరిగా:
కెజిఫ్ చాప్టర్-1 తో పోల్చుకుంటే కెజిఫ్ చాప్టర్-2 పర్వాలేదు అనిపించింది యాష్ ఫాన్స్ కి అయితే పండగే అని చెప్పొచ్చు
కన్నడ మూవీగా స్టార్ట్ అయినా కెజిఫ్ పాన్ ఇండియా మూవీ అవడం విశేషం. ఏది ఏమైనా మూవీ అయితే యాష్ ఫాన్స్ ని ఆకట్టుకుంది, ఈ మూవీతో మళ్లీ హీరో యాష్ హిట్ కొట్టాడు అని చెప్పాలి.

NBM Live రేటింగ్: 3/5