November 15, 2024
Telugu

ఊపిరి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి నష్టం కలుగుతుందా?

ఊపిరి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి నష్టం కలుగుతుందా?:

మన ఊపిరితిత్తులలోకి పీల్చుకునే గాలి ప్రాణదాత అన్న విషయం మనకు తెలుసు, కానీ దానివలన మన శరీరంలో కలిగే నష్టాల గురించి మనకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, మనం ఎల్లప్పుడూ గుండెల నిండా పీల్చుకునే ఊపిరి మనలోని దీర్ఘకాలిక వ్యాధులకు మూలకారణంగా నిలుస్తుంది. అయితే ఈ నష్టం వెనుక జరిగే ప్రక్రియ ఏమిటన్నది తెలియాలంటే అసలు మనకు స్వతంత్ర కణాల గురించి అవగాహన ఉండాలి.

స్వతంత్ర కణాల పుట్టుక:- స్వతంత్ర అణువులు అనగా సరైన విద్యుత్కణాలతో నిండని ప్రాణవాయువు యొక్క అణువులు. మొదటగా మనం గాలిని పీల్చగానే ప్రాణవాయువు మన ముక్కులోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులలోకి చేరుకుంటుంది. ఈ ఊపిరితిత్తులు సమృద్ధమైన గాలితో నిండగానే ఈ గాలి అక్కడి వాయుకోశాల గోడల నిండా ప్రవహించి రక్తంలోని హిమోగ్లోబిన్లతో కలుస్తుంది. అక్కడినుంచి మన గుండె కొట్టుకోవడం వలన హిమోగ్లోబిన్ ప్రాణవాయువుని విడిచిపెట్టి శరీరంలోని కణాలలోకి చేరడానికి కారణమవుతుంది. ఇలా గాలి మన కణాల గుండా ప్రవహించడం వలన మనకు శక్తి వస్తుంది. మన ఆయువు నిలబడుతుంది. కానీ మన శరీరంలోని ప్రతి కోణంలోనూ మైటోకాండ్రియా అనే ఒక భట్టి ఉంటుంది. ఈ మైటోకాండ్రియా మన ప్రాణవాయువుని ఉపయోగించుకొని ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ఏటీపీని (ఎడినోసైన్ ట్రైఫాస్పేట్) శక్తీ రూపంలో సృష్టిస్తుంది. ఈ ప్రక్రియ జరగాలంటే మన ప్రాణవాయువు నీరుగా మారాలి, దానికోసం నాలుగు విద్యుత్ కణాలు అవసరమవుతాయి. అయితే ప్రతిసారీ ఈ నాలుగు విద్యుత్కణాలు ప్రాణవాయువుకి అందకపోవడంతో, స్వతంత్ర అణువులు పుట్టుకొస్తాయి.

ఆక్సీకరణ ఒత్తిడి

ఈ స్వతంత్ర అణువులు తక్కువ సంఖ్యలో పుట్టినచో అవి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. కానీ అమితంగా  ఏర్పడిన స్వతంత్ర అణువులు వాటిలో లేని విద్యుత్కణం కోసం ఇతర కణాలతో కలిసి ఒక గొలుసు కట్టు ప్రతిక్రియలని సృష్టించి అనేక ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తాయి. ఈ అదుపులేని స్వతంత్ర కణాల పుట్టుక మరియు దానివల్ల మనకు కలిగే ఆరోగ్య నష్టాలను ఆక్సీకరణ ఒత్తిడి అనే పేరుతో పిలుస్తారు.

స్వతంత్ర కణాలు హెచ్చుస్థాయిలో పెరగడానికి గల కొన్ని కారణాలు

  • విపరీతంగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయామం చేయడం వళ్ళ స్వతంత్ర కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
  • ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం.
  • తినే ఆహారంలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో ఉండే కాలుష్యం.
  • సిగరెట్ పొగ

 

 

 

ఆక్సీకరణ ఒత్తిడి వళ్ళ కలిగే వ్యాధులు

  • ఈ అణువులు మన గుండెలోని కణాలతో కలిసినచో మనకు గుండెనొప్పి రావొచ్చు.
  • ఒకవేళ అవి మన కీళ్లు అయితే మనకు కీళ్లనొప్పి రావచ్చు.
  • కంట్లో శుక్లము ఏర్పడవచ్చు.
  • కాన్సర్ రావచ్చు.
  • ఆల్జిమెర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధికి దారి తీయొచ్చు

ఈ విధంగా స్వతంత్ర కణాలు అనేక దీర్ఘకాలిక సమస్యలకి కారణమయి మనల్ని ఆసుపత్రి బారిన పడేలా చేస్తున్నాయి. ఈ ప్రాణవాయువుని పీల్చే ప్రక్రియని మనం అడ్డుకోలేం కాబట్టి మనం తినే ఆహారం, మితమైన వ్యాయామం, మరియు ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లపై దృష్టి పెడదాం, రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడదాం.

Also Read ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?