January 22, 2025
Telugu

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?

మా పక్కింటిలో 17ఏళ్ళ చింటుగాడిని వాడిది బలమైన శరీరం కాదని వాడి తోటి విద్యార్థులు ఎప్పుడు హేళన చేస్తూ ఉండేవాళ్లు. దీనితో చిర్రెత్తిన చింటు ఆవేశంగా జిమ్ లో చేరి కండలు పెంచాలని ధృఢంగా నిశ్చయించుకున్నాడు. అప్పుడే వాడికి అర్థమైంది కండలు రావాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా చాల ముఖ్యమని. కానీ అసలు ఈ ప్రోటీన్ అంటే ఏమిటి,దానికోసం ఏ ఆహారం తినాలి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

ప్రోటీన్:-

ప్రోటీన్ అనగా కొన్ని వేల అమైనో ఆసిడ్ల కూటమితో కూడిన యూనిట్ల యొక్క సమ్మేళనం. మన శరీరంపైన ఉండే జుట్టునుండి దాని లోపలి కండరాల వరుకు ఈ ప్రోటీన్ లేనిదే పనిచేయలేవు. అయితే ఈ ప్రోటీన్ సమ్మేళనం కోసం 20 అమైనో ఆసిడ్ల దాకా శరీరానికి అవసరమవుతాయి. కానీ వీటిలో తొమ్మిదిని అవసరమైన అమైనో యాసిడ్లు అంటారు,  అంటే ఇవి మన శరీరం దానంతట అది సృష్టించుకోలేని అమైనో యాసిడ్లు అనమాట. కచ్చితంగా తినే ఆహారంనుంచి వీటిని మనం మన బాడీకి ఇవ్వవలసి ఉంటుంది.

అయితే దీనికోసం సగటు మనిషి కనీసం తను ఉన్న బరువు లోని సమానమైన గ్రాముల ప్రోటీన్‌లను రోజువారీ భోజనంలో తినాలి, అంటే ఒక మనిషి 80కేజీల బరువు ఉన్నాడనుకుంటే అతను 80గ్రాముల ప్రోటీన్ తన భోజనంలో రోజు తీసుకోవాలి. ఇప్పుడు ఇంత ప్రోటీన్ రావాలంటే ఏఏ ఆహారాలు తీసుకోవాలి అనేది మనం చూద్దాం.

 

సోయా బీన్స్:-

100గ్రాముల సోయాలో సగటుగా 30-40% వరకు ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా సోయాలో విటమిన్ బి12, కాల్షియమ్, విటమిన్ డి వంటి ఇతర పోషక విలువలు అధికంగా ఉంటాయి. కనుక సోయా బీన్స్ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారానికి సరైన ఎంపిక.

 

 

పన్నీర్:-

ఇక ఇపుడు పన్నీర్ గురించి, ఇది అందరికి ప్రీతిపాత్రమైన ఆహారం కదా. దీనిలోనే ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. 25గ్రాముల పన్నీర్లో సుమారు 15గ్రాముల ప్రోటీన్ ఉంటుందని స్టడీస్ చెప్తున్నా యి. అంతేకాకుండా దీనిని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే ఎక్కువసేపు మనకు శక్తిని ఇచ్చి మధ్యాహ్నం భోజనసమయం వరుకు మనల్ని ఉల్లాసంగా ఉంచుతుంది.

 

 

క్వినోవా:-

125గ్రాముల రెడ్ క్వినోవాలో 8గ్రాముల ప్రోటీన్ ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా దీనిలో విటమిన్స్, మినరల్స్, ఇంకా ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వాళ్ళ కాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా మరెన్నో రెస్పిరేటరీ సమస్యలకి , కీళ్లనొప్పులకు ముందుగా పనిచేస్తుంది.

 

బాదం:-

మొత్తం 35గ్రాముల బాదంలో 7గ్రాముల ప్రోటీన్ మనకు అందుతుంది. దీనిలో ప్రోటీన్ తో పాటుగా రిబోఫ్లావిన్, నియాసిన్, మరియు ఇతర విటమిన్స్ మనకు ఎన్నో లభిస్తాయి. దానితో మనం అర్థంచేసుకోవచ్చు రోజుకి కొన్ని బాదంపప్పులు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందని. బాదం గుండె సమస్యలకి కూడా మంచి మందులా పనిచేస్తుంది.

 

 

పప్పు దినుసులు:-

పెసలు, మినపప్పు, వంటి పప్పు దినుసులలో కూడా ప్రోటీన్ సంఖ్య అధికంగా ఉంటుంది. 100గ్రాముల పప్పులలో సగటుగా 17-23గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుందని స్టడీస్ చెప్తున్నా యి. వీటిలో ప్రోటీన్ ఒకటే కాకుండా ఐరన్, ఫైబర్ కూడా అధికముగా లభిస్తాయి. ఇవి మన రోజువారీ ఆహారంలో ఒక భాగమే కాబట్టి ఇకనుండి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ప్రోటీన్ యొక్క బెనిఫిట్స్ మనం పొందవచ్చు.

ఇవి శాకాహార ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, కానీ మాంసపు ఆహారాలలో గుడ్లు, పాలు, చేపలు, ఇంకా అనేక ఇతర ఆహార పదార్ధాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిలో ఉండే సంతృప్త కొవ్వు, మరియు అధిక రక్తపోటు లక్షణాల వల్ల శాకాహారపు ఫుడ్స్ గురించే వివరించడం జరిగింది.