November 15, 2024
Telugu

Hanuman History in Telugu: ఎవరికీ తెలియని హనుమాన్ జన్మ రహస్యం మరియు హనుమాన్ జయంతి చరిత్ర మీ కోసం

హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగను కేరళలో, ఉత్తర భారతదేశంలో మార్గశీరమాసంలో ఆంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీ రాముని భంటు అయినా ఆంజనేయుడు చైత్రశుద్ద పౌర్ణమి నాడు జన్మించాడని కొంత మంది వైశాఖ దశమి రోజున జన్మించాడని చెప్తుంటారు. భక్తులు హనుమాన్ జయంతిని భక్తి శ్రద్దలతో హనుమంతునినీ పూజిస్తారు. హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకొనే పండుగ హనుమాన్ జయంతి ఒకటి, హనుమంతుడు పుట్టిన రోజునే హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతుడు సొత్ర ప్రీయుడు శ్రీ రామ సోత్రాలు ఎక్కడ పఠిస్తే ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటారనీ నమ్మకం. హనుమంతుడు సీత రాముల దాసునిగా రామ భక్తునిగా విజయ ప్రధాతగా రక్షకునిగా పిలవబడే హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఆంజనేయుడు శ్రీ రాముడిని ఎంత భక్తి గా ఆరాధిస్తాడో తెలుసా ఏకంగా తన మనసునే మందిరంగా చేసీ ఆరాధిస్తాడు. ఆంజనేయుడినీ హనుమాన్, భజరంగబలి, మారుతి అని అనేక పేర్లతో ఆరాదీస్తారు.

Also Read: శ్రీరామ నవమి పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఎలా జరుపుకోవాలి?

హనుమంతుని జన్మ రహస్యం

వైశాఖ మాస బహుళ దశమి మంగళ వారం ఉత్తర భద్ర నక్షత్రం రోజునా అంజనాదేవికి కేసరికీ హనుమాన్ జన్మిస్తాడు. తల్లి పేరు అంజనాదేవి కనుక ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. తండ్రి కేసరి కోతులకీ రారాజు ఇంకా రామాయణం లో హనుమంతుడు ఎవరనేది తెలుస్తుంది.

హనుమాన్ జన్మ కథ

ఆంజనేయుడు ఉదయాన్నే లేవగానే సూర్యుడు ఎర్రటి పండు లాగా కనిపీంచడంతో దానినీ మీంగటానికీ ప్రయత్నించగా ఆ సమయం లో ఇంద్రుడు వచ్చి తన ఆయుధంతో దాడి చేసీ లోకకళ్యానం కోసం సూర్యుడిని కాపాడి హనుమంతునికి దవదలువాచీ వానరరూపాన్ని ఇస్తాడు అప్పటినుంచి ఆయననే హనుమంతుడిని అని పిలువబడింది. తన కుమారుడు స్పృహతప్పి పడి ఉండటం చూసీ తన తండ్రి అయినా వాయుదేవుడు కోపగీంచుకొని లోకంలో వాయువు లేకుండా చేస్తాడు, అది చూసిన బ్రహ్మ దేవుడు తన కుమారుని బ్రతికించి తనకీ కొన్ని వరాలను ఇస్తాడు. ఆవి ఈలోకంలోనే అత్యంత బలవంతుడు ఆంజనేయుడని అని వాయువు వేగం కన్నా ముందే ఉంటాడని యుద్ధం లో ఏ ఆయుధంతోను ఎవరు చంపలేరని వరం బ్రహ్మ దేవుడు ప్రసాదిస్తాడు. అలాగే దీర్ఘాయుశుడు అని సముద్రం దాటే ధైర్యాన్ని శివుడు ప్రసాదిస్తాడు ఇలా ఆంజనేయుడికి వారాలని ఇస్తారు అలా ఇవ్వడంతో వాయుదేముడు సంతోషిస్తాడు.

ఆంజనేయునికి తమలపాకుల పూజ ఎందుకు చేయాలి

ఒక సారీ సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చీలకలను తింటూ ఉన్న శ్రీరాముడు వద్దకు వచ్చిన ఆంజనేయుడు, స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఉంది అని అడగగా అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అని ఆరోగ్యానికి చాల మంచిది అని చెప్తాడు అప్పుడు వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లి పోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వస్తాడు.

Also Read: ఉగాది పండుగ ఎలా వచ్చింది – పండుగ ప్రత్యేకత ఏమిటి

తమలపాకుల విసిష్టత:
ఆంజనేయునికి లేత తమలపాకుల మాల వేస్తే రోగాలతో ఇబ్బందులు పోతాయని నమ్మకం తమలపాకుల మీద శ్రీరామ అని రాయడం చాల మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం చాల మంచిది. 11 లేదా 108 తమలపాకులతో శ్రీ రామ అని పేరు రాసి పూజ చేస్తారు.

|| జై హనుమాన్ || || జై హనుమాన్ || || జై హనుమాన్ ||