January 22, 2025
Telugu

How to control hair fall : జుట్టు ఎక్కువగా ఎందుకు రాలుతుంది ? రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు – health tips

అందరూ ఎదుర్కుంటున్న సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. పూర్యకాలం మన పెద్దవాళ్లకు 50 సంవత్సరాలైనా జుట్టు ఊడకుండా ఉండేది. ప్రస్తుత సంవత్సరంలో ఆడ, మగ,చిన్న,పెద్ద తేడాలేకుండా జుట్టు ఊడిపోతుంది చాల మంది ఎదుర్కుంటున్న సమస్యలలో జుట్టురాలడం ఒక సమస్యగా మారింది.

జుట్టురాలడానికీ గల కారణాలు:

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రధానంగా మీరు తీసుకొనే ఆహారం కావొచ్చు మెడిసిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణం కావొచ్చు అంటున్నారు వైద్యనిపుణులు మన తలపైన నిండుగా ఉండే జుట్టు ఊడిపోతుంటే ఈ రోజుల్లో తినే ఆహారం వలన అంతులేని ఒత్తిడి వలన మెడిసిన్ వలన జుట్టు ఊడిపోతుంది, చాల మందికి జుట్టు పలచ బారి పోతుంది కొంత మందికీ చిన్న వయస్సు లోనే బట్టతల వస్తుంది.

Also Read: శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ ఈ 6 రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ లో దొరుకుతాయి

జుట్టు రాలిపోకుండా నివారించే పరిష్కార మార్గాలు:

చిన్న వయస్సు లోనే జుట్టు రాలిపోతుంది దానికి ముఖ్యమైన కారణాలు మనం తీసుకొనే ఆహరం వలన ఆడ వారికీ గానీ, మగ వారికీ గానీ న్యూట్రీషియన్ డీపీషియన్సీ ముఖ్యమైన కారణం జుట్టుకి ప్రోటిన్, విటమిన్స్, ఐరన్, కావాలి వాటితో పాటు కాఫర్, B12, సెల్సియం ఇలాంటివన్నీ కూడా జుట్టు పెరగడానికిసహాయ పడతాయి. ఇవన్నీ న్యూట్రిషన్ ద్వారా దోరికితే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు, పాస్ట్ ఫుడ్ ఆహారం తినడం వలన హార్మోన్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో థైరాయిడ్ వలన ఇన్ఫెక్షన్ వలన కూడా జుట్టు ఊడిపోతుంది. తలస్నానం చేసినప్పుడు ఎక్కువ జుట్టు ఊడిపోతుంటే భాదపడుతుంటాము తలకు సరిగ్గా నూనె పెట్టుకోపోవటం వలన గానీ విటమిన్ లోపం వలన గానీ ఊడిపోతుందని మనము అనుకుంటాము.

how to control hair fall in telugu

నిజానికి జుట్టు రాలడంలో తెలిసో తిలియకో చేసే తప్పులే ఈవాళ చాల మందికీ జుట్టు రాలిపోతుంది కెమికల్ కలిపినా షాంపూలు వాడడం వలన జుట్టుతో రకరకాల జడలు వేయడం వలన జుట్టును గట్టిగా ముడివేయడం అల్లిన జడను గట్టిగ కట్టడం పిలక జుట్టు కోసం జుట్టును మూలాల వరకు లాగడం వంటివి చేయకూడదు ఈలా చేయటం వలన జుట్టు ఊడిపోతుంది.

జుట్టు రాలకుండా ఉండాలంటే ఏంచెయ్యాలి :

మనిషి తలమీద లక్ష వెంట్రుకలు ఉంటాయి వాటిలో రోజుకు 100 లేదా 75 వెంట్రుకలు రాలుతుంటాయి కాబట్టి అంత మాత్రం చేత బాధపడాల్సిన అవసరం లేదు కొంత మందిలో తుంటలు తుంటలుగా రాలుతుంటాయి, ఒక వెంట్రుక 4 లేదా 5 ఏళ్ళు తల మీద వుండి ఆ తరువాత రాలిపోతుంది దాని స్థానం లో మరొక వెంట్రుక రావడానికీ 6 నెలలు పడుతుంది. తల దువ్వినపుడు, తలస్నానం చేసినప్పుడు కొంచం ఎక్కువ జుట్టు రాలుతుంది, అది నెలకు సుమారు అర అంగుళం వరకు పెరుగుతుంది కొంతమందిలో పెద్ద సంఖ్యలో జుట్టురాలడం పలచబారడం మాడు పైకీ కనబడటం కొందరిలో బట్టతల వంటి లక్షణాలు కనబడుతుంటాయి. అయితే ఇలా ఎక్కువగా వెంట్రుకలు రాలడానికి ఆడ వారిలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలతో పాటు పోషక ఆహార లోపం వంటివి మనకు ఎదురవుతున్నాయి కొన్ని సార్లు ఎలాంటి కారణం లేకపోవచ్చు. ఈ సమస్య గురించి మరింత వివరంగా తెలుసుకుందాము ఒకప్పుడు 50 ఫై బడిన వాళ్ళకే బట్టతల వచ్చేది ఇపుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరికి బట్టతల వస్తుంది.

Also Read: వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా ఇవి తీసుకుంటే మంచిది ఇవి సమ్మర్ లో అలసిపోకుండా శరీరాన్ని చల్లగా వుండేటట్టు చూస్తాయి

జుట్టు ఎందుకు రాలుతుంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి :

వెంట్రుక జీవిత కాలం 2 నుంచి ౩ సంవత్సరాలు ప్రతి వెంట్రుక దాదాపు సెంటి మీటరు వరకు పెరుగుతుంది 3 నుంచి 4 నెలల తరువాత వెంట్రుకలు రావడం వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు రావడం జరుగుతుంది. రోజు జుట్టు రాలడం అనేది సాధారణ విషయం కానీ కొంత మందికి ఒకే రోజులో చాల జుట్టు ఊడిపోతుంది, కొంత మందిలో పేనుకోరినట్లు పీచులా పీచులా ఉంటె డాక్టర్ ను సంప్రదించాలి. అందం ఆకర్షణ తెచ్చుకొనే జుట్టు ఊడిపోతుంటే ఎవరికైనా భాదే ముఖ్యం గా ఆడవారు అయితే ఎక్కువ భాధపడుతుంటారు కొంత మంది లో వంశ్యపారం పర్యంగా బట్టతల వస్తుంది మరి మీరంతా వెంట్రుకలు రాలుతున్నాయని ఆందోళన పడవలసిన పని లేదు వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జుట్టు రాలె సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

మగవారిలో జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు తినే ఆహారంలో సరైన స్థాయిలో ఐరన్ లేని వారి జుట్టు రాలుతుంది మగవారిలో కొన్ని మందుల వాడకం వలన ఎక్కువ జుట్టు రాలుతుంది థైరాయిడ్ యొక్క పనితీరు వలన కూడా జుట్టు రాలుతుంది. అందంగా కనపడటంలో జుట్టు ముఖ్య పాత్ర పొషీస్తుంది జీవన సైలి మార్పుల వలన గానీ ప్రస్తుత కాలం లో ఉన్న కాలుష్యం మరియు అనారోగ్య కారణాల వలన స్త్రీ మరియు పురుషులలో జుట్టు రాలడం అనేది ఒక సమస్యగా మారిపోయింది కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. మనం తినే ఆహారంలో పచ్చని ఆకుకూరలు, క్యారెట్ కాయలను ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది ప్రతి మనిషికీ అందంగా నల్లగా ఉండే జుట్టు అంటే చాల ఇష్టం ప్రతి ఒక్క మనిషికీ జుట్టు చాల అందంగా ఉంటుంది అది రాలిపోతుంటే చాల బాధగా ఉంటుంది కాబట్టి మీ జుట్టు రాలిపోకుండా ఉండాలంటే డాక్టర్ ను సంప్రదించాలి. పూర్వం మన పెద్దవాళ్ళు కుంకుడు కాయలతో తలస్నానం చేసేవాళ్ళు వాళ్ళ జుట్టు 50 సంవత్సరాలైనా ఊడిపోకుండా ఉండేది.

Also Read: ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?

జుట్టు రాలకుండా ఇంటి నివారణలు:

  • పెద్ద ఉల్లిపాయ తీసుకొని దానిని పేస్ట్ చేసి రసం తీసుకోండి అందులో అలోవెరా జల్ కలపండి ఈ రెండు సమానంగా తీసుకున్న తరువాత కొబ్బరినూనె కలపండి ఈ మూడు కలిపి జుట్టుకు బాగా పెట్టండి ఆలా ఒక అరగంట పెట్టి తలస్నానం చేయండి ఈలా నెలకు 4 సార్లు పెట్టడం వలన పలచ బారిన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
  • ఇంకొక పరిష్కారం 20 రెక్క మందార ఆకులు, 20 రెక్క మందార పూలు తీసుకొని ఈ రెండిటిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసి దానిని కొబ్బరి నూనెలో వేసి 5 నిముషాలు వేడిచేసి దానినీ రోజు జుట్టుకు పెట్టండి మీ జుట్టు ఎంతో ఒత్తుగా పెరుగుతుంది
  • ఇంకొక పరిష్కారం మీరు తలస్నానం చేయక ముందు మెంతులు కొన్ని తీసుకొని వాటిని 3 గంటలు నానపెట్టుకున్న తరువాత దానిలో మందార ఆకులు వేసి మిక్సీ కి పట్టుకొని పేస్ట్ లా చేసుకొని జుట్టుకు పెట్టుకున్న తరువాత తలస్నానం చేయండి మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఒక పెద్ద కాడ కలబందను తీసుకొని పైన తొక్కుతీసి దానినీ నీటిలో వేసి బాగా కడగాలి అలా కడిగినప్పుడు తెల్లగా వస్తుంది దానిని తీసుకొని మిక్సీలో వేసి మూడు స్పూన్ల కొబ్బరినూనె వేసి జుట్టుకు పట్టించండి. 3 గంటలు ఉంచి తలస్నానం చేయండి మీ జుట్టు రాలదు ఎంతో ఆరోగ్యమైన జుట్టును పొందుతారు.