November 15, 2024
T-Health

Dragon Fruit Benefits in Telugu : డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు?

ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ చాల పేరుపొందింది ఈ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఆకారంలో పింక్ కలర్ లో ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లోపలి భాగం కొన్ని కాయలు ఎర్రగా , కొన్ని కాయలు తెల్లగా నల్ల గింజలుగా ఉంటాయి రుచికి మాత్రం కొంచం పుల్లగా ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండు ఎక్కడయినా దొరుకుతుంది ఎక్కువగా పట్టణాలలో దొరుకుతాయి, ఈ ఫ్రూట్ ఆరోగ్యానికి చాల మంచిది.

డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు:
షుగర్ ఉన్న వాళ్ళకి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాల మేలు చేస్తుంది రక్తం లో షుగర్ శాతాన్ని పెరగనివ్వదు అనేక రకాల పోషకవిలువలు ఈ ఫ్రూట్ లో ఉన్నాయి వాటిలో విటమిన్ C, ఐరన్, B1, B2 , B3 విటమిన్లు కాల్షియం,పాస్ఫరస్, జింక్, మెగ్నీషియం,పిండిపదార్ధాలు మరియు ఆనేక పోషక విలువలు కలిగిన ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్రూట్ పెద్దవాళ్ళు తిన్న, పిల్లలు తిన్న, ముసలివాళ్ళు తిన్న చాల మంచిది ఈ పండు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి ఏ ఫ్రూట్ లో లభించని పోషక విలువలు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో లభిస్తాయి. ఈ పండు తినడం వలన ఆనేక లాభాలను పొందవచ్చు , ఆరోగ్యంగా లేనివాళ్లు , నీరసంగా ఉండేవాళ్ళు, శక్తిలేనివాళ్ళు ఈ పండుని తినడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

dragon fruit nbmlive

డ్రాగన్ ఫ్రూట్ వలన కలిగే లాభాలు :
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా ఉండే యాంటీ ఆక్షిడెంట్లు గుండె జబ్బులు, కాన్సర్, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా కాపాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్దకం మరియు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి, శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది, బి.పి కంట్రోల్ అవుతుంది.

ఈ డ్రాగన్ పండు లో విటమిన్ C మరియు కెరోటిన్ల ఆమ్లాలు అధికంగా ఉండటం వలన మనకు ఇమ్మ్యూనిటి బూస్టర్లుగా పనిచేస్తుంది అలాగే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ ని మరియు వైట్ బ్లడ్ సేల్సును ఉత్పత్తిని చేయటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి అంటువ్యాదులు కానీ ఇతర జబ్బులు కానీ మన దగ్గరకు దరి చేరనివ్వదు. డ్రాగన్ పండు తింటే ఇనుము లోపాన్ని తగ్గించవచ్చు అలాగే అధిక బరువు తగ్గడంలో ఈ డ్రాగన్ పండు సహాయపడుతుంది . ఈ పండు తినడం వలన చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది అలాగే దంతాలు చిగుర్లు సమస్యలు తగ్గుతాయి, చర్మం పై ముడతలు మచ్చలు ఏర్పడవు చర్మం కాంతివంతంగా మరియు అందంగా తయారవుతుంది.

ఈ డ్రాగన్ పండు మనకు చాల మేలు చేస్తోంది అందుకే ప్రతి ఒక్కరు ఈ పండును తిన్నండి ఆరోగ్యంగా ఉన్నండి.

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్న వైద్యులను సంప్రదించండి.