December 18, 2024
T-Health

Diabetes Causes and Symptoms

ఈ రోజుల్లో మనకు రక్తంలో ఘగర్ మరియు ఘగర్ లెవల్స్ 100 కు పైగానే ఉంటున్నాయి అంటే వీళ్ళందరూ దాదాపు ఘగర్ బారిన పడడానికి 100 దాటి 120 దాక పోతే దానిని డాక్టర్లు డయాబెటిక్ దిశగా పిలుస్తారు వాడుకలో మనం ముందస్తు మధుమేహం అంటారు. కనీసం ఈదశలోనైనా జాగ్రత్తపడితే ముందస్తు మధుమేహం పూర్తి స్థాయి ఘగర్ జబ్బుగా మారకుండా నివారించుకోవచ్చు.

డైయాబెటిస్ (ఘగర్) లక్షణాలు:

మనకు అరికాళ్ళు సూదులు గుచ్చినట్టు సుర సుర అంటూ దప్పిక ఎక్కువగా ఉండటం రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా రావడం అలానే పగలు కూడా మూత్రం ఎక్కువగా రావడం అలానే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కంటిచూపు మసక బారడం బరువు తగ్గడం ఇటువంటివి అన్ని డయాబెటిక్ లక్షణాలు అలానే కొంత మందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు కొంతమందిలో అయితే నీరసంగా కళ్ళుతిరిగినట్లు ఉండటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి అప్పుడు డాక్టర్ ఈ లక్షణాలు ఉంటె ఘగర్ అని ఘగర్ టెస్టలు చేసి చెప్తారు.

ఘగర్ ఉన్నప్పుడూ ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:

ఘగర్ పేరులోనే తీపి ఒక్కసారి దీని బారిన పడితే జీవితమంతా చేదే రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకొనేందుకు నిత్యం మందులు మింగాలి తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా ఫైబర్ వున్నా ఆహారాన్ని తినాలి వీటికితోడు శరీరానికి కూడా శ్రమను కలిగిస్తుండాలి ఈలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం మన అదుపులో ఉంటుంది.

మనం ఆహారంలో తగ్గించ వలసిన వస్తువులు:

మన శరీరంలో ఘగర్ ఎక్కువగా ఉంటె ఘగర్ ని తగ్గించుకోవడానికి నూనె, కొవ్వు పదార్దాలు తగ్గించుకోవాలి తరువాత అన్నం ఒక లిమిట్ గాతినాలి తరువాత తీపి వస్తువులు పూర్తిగా మానెయ్యాలి టీ, కాపీ లో ఘగర్ వేయకుండా ఇపుడు మార్కెట్ లోకి బ్రవున్ షుగర్ వస్తుంది అది వాడండి ఘగర్ ని కాంట్రొలుగా ఉంచుతుంది. ఘగర్ లెవల్స్ తగ్గిందో, పెరిగిందో అని షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

ఘగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి :

షుగర్ ఎక్కువగా ఉంటె అరటి పండ్లు, సీత ఫలం, సపోటా పండ్లు, ద్రాక్ష ఇవి మాత్రం తగ్గించి మిగతా పండ్లు తీసుకోవచ్చు రోజు వారి ఆహారంలో ఒక పండు నైనా తీసుకోవాలి ఆపిల్, బొప్పాయ, పుచ్చకాయ, జామా కాయని రోజు వారి ఆహారంలో ఏదో ఒక పండును తీసుకోవాలి అయితే పండ్లు రసాలు అంతగా తీసుకోకూడదు అవి జ్యూస్ చేయటం వలన పీచు పదార్థం పోయి అన్ని రకాల పోషకాలు రావు అందుకనే రోజుకి ఒక పండు తినడం వలన విటమిన్స్, మినరల్స్ అన్ని కరెక్ట్ గా అందుతాయి.

బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా తీసుకోవచ్చు లేదా పాత బియ్యంతో పాటు పాత గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ధాన్యాలను తరుచుగా తీసుకోవాలి కాయకురాలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి ఆహారంలో ఎక్కువ పీచు పదార్థం ఉండే టట్లు చూసుకోవాలి సరైన సమయంలో భోజనం చేయాలి విందులు, ఉపవాసాలు మానేయాలి తియ్యని వంట పదార్దాలు తగ్గించాలి పాలు, పాలతో చేసిన వంటకాలు అలాగే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్క జొన్న, మరమరాలు, గోధుమలు, సేమ్యా వాటిని తరుచుగా తీసుకోవాలి నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ పండ్లను తినడం వలన షుగర్ చక్కగా అదుపులో ఉంటుంది. షుగర్ పేషంట్ టైమ్ కి రోజు భోజనం అయినా పండ్లు అయినా సరైన సమయంలో తీసుకుంటే షుగర్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఉంటాయి ఒక క్రమంగా షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

ఏ ఏ సమయం లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి:

షుగర్ ఉన్న వాళ్ళు ఉదయం ఇడ్లి, పెసరెట్ గాని తీసుకోవాలి నూనె లేని ఆహారం తీసుకోవడం చాల మంచిది తరువాత మధ్యాహ్నం అన్నం తక్కువ తీసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి నూనె తక్కువ ఉండే కూరను తినడం వలన మన షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి తరువాత వెన్న తీసిన పెరుగు, మజ్జిగ తాగొచ్చు. సాయంత్రం స్నాక్స్ కింద సెనగలు,కందులు ఎవైనా తినొచ్చు ఓట్స్, పచ్చికూరగాయ ముక్కలు తీసుకోవడం వలన షుగర్ వాళ్ళు చాల ఆరోగ్యంగా ఉంటారు రాత్రి టైంలో బ్రోవున్ రైస్ గాని జొన్నరొట్టెలు గాని పుల్కా గాని తీసుకోవడం మంచిది.

షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ రాగి సంగటి, మొలకెత్తిన గింజలు తినడం చాల మంచిది జొన్నపేలాలు,మొక్కజొన్న గింజలు మధుమేహానికి చాల మంచిదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి వీటిని అందరూ తీసుకోవాలి ప్రతి రోజు తాజా బొప్పాయి పండును రోజు తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ చేస్తుంది చాల ఆరోగ్యం గా ఉంటారు.