January 22, 2025
Telugu

Cumin seeds benefits : జీలకర్ర వల్ల ఉపయోగాలు | Health Tips in telugu

ఈ రోజుల్లో అందరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కారణం బయట తినే ఆహారం మరియు తక్షణమే తయారయ్యే వంటకాలు (మ్యాగీ, నూడిల్స్) అలాగే ఎసిడిటి ఆహారం ఇవి తినడం వలన చాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ప్రతిఒక్కరిలో తరుచు వస్తున్నా ఇబ్బంది తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం దీని వల్ల గ్యాస్, ఎసిడిటి ఎక్కువ అవుతాయి, దీని కోసం మనం తినే ఆహారంలో జీలకర్ర ఉండేటట్టు చూసుకోవాలి.

జీలకర్ర వల్ల ఉపయోగాలు:

జీలకర్రను వంట చేసే టప్పుడు వాడతాము మన శరీరానికి జీలకర్ర చాల ఉపయోగ పడుతుంది ఆహారంలో సువాసనతో పాటు రుచిని తీసుకొనివస్తుంది. జీలకర్రలో అద్భుత మైన ఔషధ గుణాలు ఉన్నాయి మనం పరగడుపున జిలకర్రాన్ని తిన్న జిలకర నీళ్లు తగిన మన శరీరానికి చాల మంచిది.

Also Read: శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ ఈ 6 రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ లో దొరుకుతాయి

జీలకర్ర వలన కలిగే లాభాలు:

జీలకర్ర మన జీర్ణ శక్తిని మెరుగుపర్చడంలో సహాయ పడుతుంది ఆకలిని పెంచుతుంది కడుపులో ఉండే వ్యర్థ పదార్దాలను బయటకు పంపిస్తుంది రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్దీకరిస్తుంది. అధిక రక్త పోటు సమస్యలను తగ్గించి శరీరం లోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగు పరుస్తుంది. గుండెకు రక్త సరఫరా సాపిగా అందేలా సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకా చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మం పై ఏర్పడే ముడతలు మరియు పొడిబారే సమస్యలను తగ్గించి చర్మానికి కావలిసిన పోషకాలను అందించి శరీరాన్ని అందంగా ఉంచుతుంది, మూత్రాశయ సమస్యలను తగ్గిస్తుంది, అలాగే మనము జీలకర్ర నీళ్లు తీసుకోవడం వలన కిడ్నీలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి పేగుల్లో ఏర్పడే వ్యర్దాలను తొలగిస్తుంది కడుపులో ఏర్పడే వికారం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నివారిస్తుంది అంతే కాకుండా శరీరంలో వచ్చే తేపుల సమస్యలను తగ్గిస్తుంది ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మొలలు వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తుంది శరీరంలో ఏర్పడే ఆనారోగ్యా సమస్యలను తొలగిస్తుంది. మన శరీరంలో ఏర్పడే జలుబు, దగ్గును తగ్గిస్తుంది మలబద్దకం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించడంలో జీలకర్ర బాగా ఉపయోగ పడుతుంది, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని అని ఆయుర్వేద నిపుణులు జీలకర్ర మీద ప్రయోగాలు చేసి ఆరోగ్యానికి జీలకర్ర చాల మంచిది అని చెబుతున్నారు.

uses of cumin seeds in telugu

ఉదయం జీలకర్ర నీళ్లు తీసుకోవడం వాళ్ళ ఉపయోగాలు:

మనందరికీ చాల మంచిది జీలకర్ర నీళ్లు తాగడం వలన ఇందులో విటమిన్ A మరియు C లు ఉంటాయి అలాగే ఫైబర్ ను ఎక్కువగా కలిగి ఉంటుంది. జీలకర్ర జీర్ణ శక్తికి చాల మంచిది మనం వంటలలో జీలకర్రను ఉపయోగించటం వలన మనకు అరుగుదల బాగుంటుంది అందుకే మనం అన్ని వంటలలో జిలకర్రని వాడతాము. మన శరీరంలో కొవ్వును తగ్గించడానికి ఆకలి బాగా వేయడానికి ఉపయోగపడుతుంది అందుకే మనం కూరల్లో ఎక్కువ జిలకర్రని వాడతాము చిన్న పిల్లలకి కూడా జీలకర్ర నీళ్లు తాపిస్తే జీర్ణం బాగా అవుతుంది. బీపీ వాళ్లకు, షుగర్ వాళ్లకు చాల మంచిది మలబద్దకాన్ని నివారించవచ్చు పరగడుపున జీలకర్ర నీళ్లు ఒక గ్లాసు తాగితే చర్మసౌందర్యానికి, జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగ పడుతుంది, అలాగే మనకు జీలకర్ర వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.

Also Read: వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా ఇవి తీసుకుంటే మంచిది ఇవి సమ్మర్ లో అలసిపోకుండా శరీరాన్ని చల్లగా ఉండేటట్టు చూస్తాయి

తయారు చేసుకొనే విధానం:

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి గ్యాస్ మీద పెట్టుకొని 7 నిముషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత వడ కట్టుకొని గ్లాస్ లో పోసుకున్నాక నిమ్మకాయ రసం 2 స్పూన్లు తీసుకొని తాగాలి కానీ పరగడుపున తాగితే మన ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Note: రెండు రోజులకు ఒకసారి లేక వారానికి ఒకసారి తీసుకోవడం మంచిది అని వైద్యనిపులు తెలుపుతున్నారు.