December 18, 2024
Telugu

CM YS Jagan wishes to Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు గారికి YS జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు

అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచస్థాయి నేతగా ఏదగటం సామాన్యమైన విషయం కాదు. 43 ఏళ్ళ సుధీర్గ కాలంలో రాజకీయం లో ఏన్నో వడిదుడుకులను ఏదురుకొని, విలువలు వ్యక్తిత్వం కలవారు. తెలుగు జాతి వెలుగు రేఖగా, తెలుగు తేజంగా పేరుపొందారు, అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలకు ఏప్పుడు అండగా ఉంటూ ప్రజల సేవకు అంకితమయ్యారు. నాయకుడు అంటే ఏప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని ఏప్పుడు నీరంతరం ప్రజల కొరకు సేవ చేసే వారిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఖర్జురా నాయుడు, అమనమ్మా నాయుడు దంపతులకు 1950 ఏప్రిల్ 20 న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు మన బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండేవి.

Also Read: అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి పిలుపుకు 40 సంవత్సరాలు

కాంగ్రస్ హయాంలో 28 ఏళ్లలో మంత్రి పదవి చేపట్టిన ఘనత చంద్రబాబుది. చిన్న వయసులోనే రాజకీయం లో ఉన్న చంద్రబాబుని ఎన్టీఆర్ చూసి తన ౩ వ కుమర్తి భువనేశ్వరిని చంద్రబాబు నాయుడు కీ ఇచ్చి 1981 సెప్టెంబర్ 10 న వివాహం జరిగింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను వీడి తెలుగు దేశం పార్టీ లో చేరాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు కుడి భుజంగా మారాడు. ఎక్కడ ప్రజలు బాధపడుతుంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండేవారు. వారి సమస్యలను దగ్గర ఉండి తీర్చేవారు ఆలాంటి వ్యక్తి ఒక్కరు ఉన్న చాలు రాష్టం, దేశం, ప్రపంచం నడకలు మార్చే శక్తి ఐటి రంగానికి ఉందని ఆ రోజుల్లోనే విస్వసించారు 1998 లో హైదరాబాదులో హైటెక్ సిటీ నీ ప్రారంభించారు. బై బై బెంగుళూరు ఛలో హైదరబాద్ అనే నినాదాన్ని తెచ్చారు. ఐటి రంగాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.

2004 ,2009 ఎలక్షన్ లో ఓడిపోయినా ఏ మాత్రం తగ్గకుండా ప్రజల కోసం పోరాడి విజయ తీరాలా వైపు నడిపించారు. 2012 లో పాదయాత్ర 2817 కీలో మీటర్లు నడిచి రికార్డులు సృష్టించారు.1253 గ్రామాల 162 మండలాలు 16 అసేంబ్లీ నియోజకవర్గాలు 5 మునిసిపాల్ కార్పొరేషన్లు ప్రజలను అడిగి వాళ్ళ బాధలను కష్టాలను తెలుసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014 ఏన్నికల్లో చంద్రబాబు అయితేనే అప్పుల ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ పూర్వ వైభవం తెస్తారు అని అలోచించి ప్రజలు చంద్రబాబుని గెలిపించారు. 2014 జూన్ 8 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ముఖ్యమంత్రి తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశారు. పోలవరం, అమరావతి వంటి అత్యంత అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టారు 2019 ప్రభుత్వం మారింది. వైసీపీ చేతికి అధికారం వచ్చింది. చంద్రబాబు మాత్రం పార్టీ తో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు.

Also Read: ఎవరికీ తెలియని హనుమాన్ జన్మ రహస్యం మరియు హనుమాన్ జయంతి చరిత్ర మీ కోసం

ఈ రోజు 71 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికీ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే కొంతమంది ప్రముఖులు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.