January 22, 2025
Telugu

అమితాబ్ బచ్చన్ తెలుగు మూవీ ట్రైలర్ రివ్యూ

తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై జె చిన్నారి నిర్మించిన చిత్రం అమితాబ్ బచ్చన్ మూవీ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ విడుదల చేసారు. ఈ మూవీ లో హీరో హీరోయిన్ గా సూర్య , రీతుశ్రీ యాక్ట్ చేసారు దీనికి డైరెక్టర్ జె మోహన్ కాంత్ , కో ప్రొడ్యూసర్ అక్కల శ్రీనివాస్ రాజు మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఆశ్రీత్ అయ్యంగార్.

మొదటగా డైరెక్టర్ జె మోహన్ కాంత్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నేను చూసిన మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ ఈ మూవీ నాకు చాల బాగా నచ్చింది అని అందుకే నేను ఈ మూవీ కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నాతో పాటు ప్లక్ కార్డ్స్ తో సపోర్ట్ చేయవచ్చు అని అన్నారు. దీనికి అమితాబ్ బచ్చన్ మూవీ టీం మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది.

Also Read: చిన్న సినిమాగా ప్రజలముందుకి వచ్చి సంచలనం సృష్టించిన “ది కాశ్మీరీ ఫైల్స్”

ప్రముఖ బిజినెస్ మాన్ సుదర్శన్ రెడ్డి చేతుల మీదగా అమితాబ్ బచ్చన్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసారు. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మూవీ ట్రైలర్ చాల బాగుంది అని ఈ మూవీ గణ విజయం సాదించాలి అని ఈ సందర్బంగా మూవీ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు.

డైరెక్టర్ జె మోహన్ కాంత్ గారు మాట్లాడుతూ మా అమితాబ్ బచ్చన్ మూవీ చాల బాగా వచ్చింది అని మూవీ ఇంత గొప్పగా రావడానికి మా టీం మొత్తం చాల కృషి చేసింది అని అన్నారు. అలాగే ఈ మూవీకి ఎంతో సపోర్ట్ చేసి సినిమా త్వరగా కంప్లీట్ అవడానికి కారణం అయినా మా కో ప్రొడ్యూసర్ అక్కల శ్రీనివాస్ రాజు గారికి చాల చాల థాంక్స్ అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అలాగే హీరో సూర్య కొత్త యాక్టర్ ఐన కూడా చాల బాగా యాక్ట్ చేసాడు అలాగే హీరోయిన్ రీతుశ్రీ కూడా చాల బాగా యాక్ట్ చేసింది. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షల ముందుకు తీసుకొని వస్తామని ఈ మూవీ మిమ్మలిని ఎంతగాను అలరిస్తుంది అని ఈ సందర్బంగా జె మోహన్ కాంత్ గారు చెప్పారు.

కో ప్రొడ్యూసర్ అక్కల శ్రీనివాస్ రాజు గారు మాట్లాడుతూ నాకు మోహన్ కాంత్ గారి హార్డ్ వర్క్ నచ్చి మొదటిగా ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అందరు ఈ మూవీ ని థియేటర్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను అలాగే మోహన్ కాంత్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా చాల చాల చేయాలి అని కోరుకుంటున్నాను.

బ్యానర్ : తార శ్రీ క్రియేటివ్ వర్క్స్
ప్రొడ్యూసర్ : జె చిన్నారి
కాస్టింగ్ : సూర్య , రీతుశ్రీ , వేణు , ఉన్ని కృష్ణా
రైటర్ మరియు డైరెక్టర్ : జె మోహన్ కాంత్
కో ప్రొడ్యూసర్ : అక్కల శ్రీనివాస్ రాజు
సినిమా టోగ్రఫీ : కిరణ్ దాసరి
మ్యూజిక్ : ఆశ్రీత్ అయ్యంగార్

Also Read: Radhe Shyam Movie Review : The Story turns out to be a turgid romantic drama hidden behind the glossy visuals