January 5, 2025
T-Entertainment

కృష్ణ వ్రింద విహారి మూవీ రివ్యూ – నాగసౌర్యకి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందచేస్తుందా?

రీసెంట్ గా నాగసౌర్యని హీరోగా “ఇరా క్రియేషన్స్” బ్యానర్ లో “అనీష్ ఆర్ కృష్ణ”చే డైరెక్ట్ చేయబడిన చిత్రం ఈ కృష్ణ వ్రింద విహారి. ఈ సినిమా టీజర్ ని చూస్తే ఇదొక హాస్య పూర్వకమైన ఫ్యామిలీ డ్రామా అని మనకు తెలుస్తుంది. అయితే ఈ మూవీ 23 సెప్టెంబర్, 2022లో రిలీజ్ అయి ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కానీ బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టేంత డెప్త్ ఈ మూవీకి ఉందా? రివ్యూ చూద్దాము.

కథనం:

హీరో కృష్ణ (నాగసౌర్య) ది గోదావరి జిల్లాలోని గ్రామంలో ఒక బ్రాహ్మణ  కుటుంబం. కట్టుబాట్లకు, సంప్రదాయానికి విలువ ఇచ్చే కుటుంబంగా వీరికి ఊళ్లో మంచి పేరుంది.  అతడి తల్లి అయిన అమృతవల్లి (రాధిక) అంటే ఊళ్లో అందరికి ఎంతో గౌరవం కూడా.

ఇలా ఉన్న కృష్ణకి హైదరాబాద్లో  టెక్నికల్  ట్రైనర్ గా ఉద్యోగం వస్తుంది. దాంతో భాగ్యనగరానికి చేరుకున్న కృష్ణ అదే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసే వ్రింద (షిర్లీ సేథియా)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వ్రింద కూడా కృష్ణని ప్రేమిస్తుంది కానీ ఆమె ఉన్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉండలేపోతుంది.

ఈ విషయం తెలుసుకున్న కృష్ణ ఆమెకి తోడుగా నిలుస్తాడు. కానీ కుటుంబంలోని కట్టుబాట్లు, సాంప్రదాయాలు తెల్సిన కృష్ణ వ్రిందతో అతని పెళ్ళికి ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి వారితో అతడు పెళ్ళికి పనికిరానంటూ అబద్ధం ఆడతాడు. ఇక తరువాత కధ ఎలా కొనసాగిందనేదే మిగతా సినిమా.

రివ్యూ:

ఈ సినిమా మూడు నెలల క్రింద వచ్చిన నాని మూవీ “అంటే సుందరానికి” కథకి చాలా దగ్గర పోలికలతో ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హాస్యం, హీరోయిన్ తో ప్రేమాయణం తోనే సాగిపోతుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, సత్య కథలో మంచి హాస్యాన్ని పండించారు. కానీ మిగతా లవ్ స్టోరీ అంత రొటీన్ గానే ఉందనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో ఉండే ఆక్షన్ సీన్స్ కూడా కథకి అనుగుణంగా అమర్చడంలో డైరెక్టర్ విఫలమయ్యారు.

ఇక సెకండ్ హాఫ్ లో కొంచెం ఫామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉంటుంది కానీ అక్కడ పెట్టిన అత్త-కోడళ్ల డ్రామా అంతగా ప్రేక్షకుల్ని అలరించ లేకపోయింది. కానీ ప్రీ-క్లైమాక్స్ లో రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ హంగామా వినోదాన్ని మంచి పంచింది.

ఇక హీరో యాక్షన్ కి  వస్తే సాఫ్ట్ లవర్ బాయ్ గా నాగసౌర్య ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యారు. హీరోయిన్ షెర్లీ సేథియా కూడా బాగా ఆక్ట్ చేశారు. కథలో ఎంతో ముఖ్యమైన పాత్ర వెన్నెల కిషోర్ గారిది, ఆయన ఆ పాత్రకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. రాధికా కూడా బాగా ఆక్ట్ చేశారు గాని ఆమె కాస్ట్యూమ్స్ ఆమె పాత్రకి ఉండే ప్రాముఖ్యతని సరిగ్గా ప్రేక్షకులకి చూపించలేపోయాయ్.

ఇంకా చివరగా కృష్ణ వ్రింద విహారి చిత్రం కాలి సమయాల్లో చూడదగ్గ చిత్రమే గాని ప్రత్యేకంగా సమయాన్ని వ్యచ్చించి చూసే సినిమా కాదన్నది నా అభిప్రాయం.  

NBM Live Rating: 3/5