December 18, 2024
Telugu

6 vitamin fruits and Vegetables : శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ ఈ 6 రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ లో దొరుకుతాయి

పండ్లు మరియు వెజిటేబుల్స్ డైలీ తినడం లేదా జ్యూస్ లా తీసుకోవడం వలన గుండెకు సంబందించిన జబ్బులు మరియు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. కొన్ని రకాల కాన్సర్ లును కూడా తగ్గించటంలో ఉపయోగపడతాయి అలాగే కంటి మరియు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి , షుగర్ లెవెల్స్ ను నియంత్రిచడంలో ఉపయోగపడతాయి. అయితే ఆ 6 రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ ఏంటో ఒకసారి చూద్దాం

బీట్రూట్ మరియు బీట్రూట్ జ్యూస్:

బీట్రూట్ జ్యూస్ అనేది ఆరోగ్యానికీ ఎంతో మంచిది రోజంతా నీరసంగా ఉండే వారు బీట్రూట్ జ్యూస్ తాగితే ఉషారుగా ఉత్సహంగా ఉంటారు. పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యానికీ చాల మంచిది రక్తం కూడా తయారవుతుంది ఎంతో శక్తి కలిగి ఉంటారు రోజంతా మీ పనులన్నీ ఉషారుగా చేసుకుంటారు అంతే కాకుండా ఈ జ్యూస్ తాగటం వలన బరువు కూడా తగ్గుతారు రోజు బీట్రూట్ తిన్నా జ్యూస్ తాగిన మన ఆరోగ్యానికీ చాల మంచిది కళ్ళకు కూడా చాల మంచిది.

Also Read: వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి బదులుగా ఇవి తీసుకుంటే శరీరానికి మంచిది

క్యారెట్ మరియు క్యారెట్ జ్యూస్:

క్యారెట్ మన ఆరోగ్యానికీ చాల మంచిది తీపిగా ఉండే కూరగాయలలో క్యారెట్ ఒకటి పోషక విలువలు శరీరానికీ విటమిన్స్ లను ఖనిజ లవణాలను అందిస్తుంది. క్యాన్సర్, గుండెపోటు రాకుండా కాపాడుతుంది క్యారెట్ ను తినటం వలన కళ్ళకు మంచిది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది విటమిన్ A అన్ని రకాల కంటిసమస్యల నుండి కాపాడుతుంది. క్యారెట్ తినడం వలన కంటి సమస్యలు దూరం అవుతాయి కంటి చూపు బాగుంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది క్యాన్సర్ నీ కూడా నివారించే గుణం క్యారెట్ కుంది క్యారెట్ మన జుట్టును ఆరోగ్యాంగా ఉంచుతుంది. క్యారెట్లో ను వంటకం గాను, జ్యూస్ మరియు పచ్చిగాను తింటాము. దీనిలో ఏ,బి,సి విటమిన్స్ ఉన్నాయి ఇవి మన శేరీరానికీ ఎంతో మంచిది క్యారెట్ లో ఉండే విటమిన్స్ A మీ చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది క్యారెట్ జ్యూస్ తాగేవారికీ నిద్ర బాగుంటుంది జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది మహిళలలో వచ్చే రుతు సమస్యలను దూరం చేస్తుంది రోజు క్యారెట్ జ్యూస్ కానీ కాయలను తీసుకోవటం వలన ఆరోగ్యం బాగుంటుంది.

పుచ్చకాయ మరియు పుచ్చకాయ జ్యూస్:

వేసవికాలంలో ఎక్కువ మనకు దోరికేవి పుచ్చకాయలే ఎక్కడ చుసిన అవే ఉంటాయి వేసవికాలంలో పుచ్చకాయ తిన్నా జ్యూస్ తాగటం వలన ఎండతాపం తగ్గుతుంది అలాగే ఉత్యేజాన్ని ఇవ్వడంలో వీటినీ మించి మరొకటి లేదు ఈ పండును తినటం వలన డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అందుకే సమ్మర్ వచ్చింది అంటే మనకు గుర్తుకువచ్చేది పుచ్చకాయ మన వంట్లో వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్ల బడేలాగా చేస్తుంది.

ఉసిరి మరియు ఉసిరి జ్యూస్:

ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలనైనా అద్భుతంగా నివారిస్తుంది, ఉసిరి కాయ తిన్నా జ్యూస్ గా తీసుకున్న అనేక లాభాలను పొందవచ్చు ఉసిరి అమోఘమైన యాంటీ ఆక్సీడెంట్లను యాంటీఏజింగ్ లక్షనాలను కలిగి ఉంటుంది ఉసిరి యవ్వనంగా కాంతి వంతంగా మార్చడంతో పాటు చర్మ సమస్యలను దూరం చేస్తుంది. అధిక బరువు సమస్యలతో బాధపడే వారికీ ఉసిరి జ్యూస్ చాల మంచిది ఉసిరి లో విటమిన్ సి ఉన్నాయి అవి జీర్ణక్రియను మేరుగుపరుస్తుంది పొట్టచుట్టూ ఉండే కొవ్వును కరగడానికీ సహాయపడుతుంది రక్త హీనత సమస్యలను దూరం చేస్తుంది అంతే కాకుండా రక్తాన్ని సుద్ది చేస్తుంది గుండె కండరాల వ్యాధులను తగ్గిస్తుంది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది మలబద్దకం ను నివారిస్తుంది మూత్రనాళ సమస్యలను మధుమేహ సమస్యలను తగ్గిస్తుంది.ఉసిరి అధ్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

ద్రాక్ష పండ్లు మరియు ద్రాక్ష జ్యూస్:

ద్రాక్ష పళ్ళు తినటం లేదా తాగటం వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ద్రాక్ష పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి మన ఆరోగ్యానికీ చాల మంచిది ద్రాక్షలో విటమిన్ ఏ, సి, బిసిక్స్ లు ఉన్నాయి ద్రాక్ష రసం తాగటం వలన ఏ, సి, బీసీక్స్ ఏవైనా తక్కువ అయితే ఎక్కువ ద్రాక్ష పండ్లను గానీ ద్రాక్ష జ్యూస్ తాగండి విటమిన్ లోపం తగ్గుతుంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది చర్మ సౌందర్యం లభిస్తుంది ప్రతిరోజు తాగటం వలన ఏసిడీటీ సమస్యలు తగ్గిస్తుంది.

Also Read: IPL 2022 FINAL SQUAD LIST

చెరకు మరియు చెరకు రసం:

చెరకు రసం మనకు చాల మంచిది చాల తీపిగా ఉంటుంది చెరకు రసం తాగటం వలన అలసట తగ్గించి శక్తిని ఇస్తుంది డయాబెటిక్ రోగులకు మంచిది ఇందులో కాల్షియం, మేగ్నిషియం, పొటాషియం, ఇనుము అధిక సాంద్రత కారణంగా చెరకు రసం యొక్క ఆల్కహాల్ నీ ఏర్పరుస్తుంది చెరకురసం మూత్రపిండాలను మేరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇది కాలేయము అంటువ్యాధుల భారీ నుండి కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది నోటి నుంచి దుర్వాసినని తగ్గిస్తుంది.