December 18, 2024
Telugu

1000 కోట్ల క్లబ్ లో చేరిన 3rd ఇండియా మూవీగా RRR మూవీ?

ది గ్రేట్ లెజండరీ డైరెక్టర్ రాజమౌళి (జక్కన్న) తీసిన మూవీ RRR. ఈ మూవీలో నటించిన ఎన్టీఆర్ రాంచరణ్ నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ విడుదలై రెండు వారాలు అవుతుంది అయినా కలెక్షన్స్ లో ఏ మాత్రం తగ్గటం లేదు దీనికి కారణం ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి లేకపోవడమే. ఇప్పటికి ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకొని పోతుంది.

Also Read: RRR మూవీ తరువాత ఎన్టీఆర్ రాంచరణ్ మూవీస్ పరిస్థితి ఏమిటి? హిట్ లేక ఫ్లాప్?

ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే కేవలం 3 వారాలలోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. అలాగే ఇండియాలో 1000 కోట్ల క్లబ్ లో చేరిన 3వ మూవీగా రికార్డు సాధించింది. RRR మూవీకి ముందు ఆమిర్ ఖాన్ దంగల్ (Rs.2024cr) , ప్రభాస్ బాహుబలి 1 (Rs.1800cr) గా వున్నాయి. అయితే ఇండియాలో టాప్ 3 మూవీలో రాజమౌళి మూవీస్ 2 ఉండటం విశేషం.

అయితే ఈ కలెక్షన్స్ కి కారణం రాజమౌళి, ఎన్టీఆర్ , రాంచరణ్ చేసిన ప్రమోషన్స్. ఈ వారంలో విడుదల అవుతున్న విజయ్ బీస్ట్ మూవీ (Beast) 13th ఏప్రిల్ 2022 న మరియు యాష్ కెజిఫ్ చాప్టర్ 2 (KGF2) మూవీ 14th ఏప్రిల్ 2022 న వస్తుండటంతో RRR మూవీ కలెక్షన్స్ కి బ్రేక్స్ పడే అవకాశం వుంది.

Also Read: RRR 3rd day కలెక్షన్స్ : బాహుబలి కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన RRR మూవీ